దసరా ఏర్పాట్లపై సమీక్ష
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో నిర్వహిస్తున్న దసరా ఉత్సవాల ఏర్పాట్లపై మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. దుర్గాఘాట్‌లోని మోడల్ గెస్ట్ హౌస్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశానికి దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, మంత్రులు వంగలపూడి అనిత, కొల్లు రవీంద్ర, ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు సుజనాచౌదరి, గద్దె రామ్మోహనరావు, బొండా ఉమా, కలెక్టర్ జి.సృజన, సీపీ ఎస్‌వీ రాజశేఖరబాబు, దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సత్యనారాయణ పాల్గొన్నారు. ఉత్సవ ఏర్పాట్లపై దుర్గగుడి ఈవో కేఎస్ రామరావు మంత్రులు, ప్రజా ప్రతినిధులకు వివరించారు. అనంతరం మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మీడియాతో మాట్లాడారు. దసరా ఉత్సవాలను విజయవంతంగా నిర్వహిస్తామని, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేలా ఏర్పాట్లు చేశామన్నారు. రూ.500 టికెట్ తీసుకున్న వారికి సైతం బంగారు వాకిలి దర్శనం కల్పిస్తామని, 13 శాఖల సమన్వయంతో భక్తులకు అవసరమైన అన్ని సదుపాయాలను కల్పించామన్నారు. బుధవారం మధ్యాహ్నానికి అన్ని పనులు పూర్తి కావాలని ఆదేశాలు ఇచ్చామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment