రేపటి నుంచి భారీ వాహనాల దారి మళ్లింపు | - | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి భారీ వాహనాల దారి మళ్లింపు

Published Wed, Oct 2 2024 3:14 AM | Last Updated on Wed, Oct 2 2024 3:14 AM

-

విజయవాడస్పోర్ట్స్‌: దసరా నవరాత్రులను పురస్కరించుకుని విజయవాడ నగరంలోకి భారీ వాహనాలు ప్రవేశించకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్‌ కమిషనర్‌ ఎస్‌.వి.రాజశేఖరబాబు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

● హైదరాబాద్‌ నుంచి చైన్నెకి రాకపోకలు సాగించే వాహనాలను నార్కెట్‌పల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, అద్దంకి, మేదరమెట్ల మార్గాన్ని అనుసరించాలని చెప్పారు.

● హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నంకు రాకపోకలు సాగించే వాహనాలు ఇబ్రహీంపట్నం రింగ్‌, జి.కొండూరు, మైలవరం, నూజివీడు, హనుమాన్‌జంక్షన్‌, ఏలూరు మార్గాన్ని అనుసరించాలని సూచించారు.

● విశాఖపట్నం నుంచి చైన్నెకి రాకపోకలు సాగించే వాహనాలు హనుమాన్‌జంక్షన్‌ బైపాస్‌, గుడివాడ, పామర్రు, చల్లపల్లి, మోపిదేవి, పెనుమూడి వారధి, రేపల్లె, బాపట్ల, చీరాల, త్రోవగుంట, ఒంగోలు మార్గాన్ని అనుసరించాలని చెప్పారు.

● గుంటూరు నుంచి విశాఖపట్నంకు బుడంపాడు, తెనాలి, వేమూరు, కొల్లూరు, వెల్లటూరు జంక్షన్‌, పెనుమూడి వారధి, చల్లపల్లి, పామర్రు, గుడివాడ, హనుమాన్‌జంక్షన్‌ బైపాస్‌, ఏలూరు మార్గాన్ని అనుసరించాలన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement