‘కార్తిక’ స్నానాలకు సకల సౌకర్యాలు
కోనేరుసెంటర్: కార్తిక పౌర్ణమిని పురస్కరించుకుని సముద్ర స్నానాలు ఆచరించే భక్తులకు అసౌకర్యం కలగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ అధికారులను ఆదేశించారు. సోమవారం రాత్రి ఆమె ఎస్పీ గంగాధరరావుతో కలిసి మంగినపూడి బీచ్‌ను సందర్శించారు. పుణ్యస్నానాల సందర్భంగా బీచ్ వద్ద అవసరమైన ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో చర్చించి పలు ఆదేశాలు ఇచ్చారు. జేసీ మాట్లాడుతూ బీచ్‌తో పాటు దత్తాశ్రమం వద్ద వైద్య శిబిరాలు, హెల్ప్ డెస్క్‌లు, తాగునీటి సౌకర్యం, మొబైల్ టాయిలెట్స్ ఏర్పాట్లు చేయాలని సూచించారు. బీచ్ వద్ద లైటింగ్, బారికేడింగ్ ఏర్పాటు చేయాలన్నారు. అవసరమైన బోట్లుతో పాటు గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలన్నారు. అంబులెన్స్, అగ్నిమాపక వాహనాలను సిద్ధంగా ఉంచాలన్నారు. పారిశుద్ధ్య సిబ్బంది బీచ్‌ను పరిశుభ్రంగా ఉంచాలని చెప్పారు. మహిళలు దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేక శిబిరాలను ఏర్పాటుచేయాలని చెప్పారు. భక్తుల కోసం ప్రత్యేక బస్సులు నడపాలన్నారు. బీచ్ వద్ద ఏర్పాట్లపై ఈనెల 13వ తేదీన కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్షిస్తారని, అవసరమైన ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఎస్పీ గంగాధరరావు మాట్లాడుతూ బీచ్ వద్ద ట్రాఫిక్ సమస్య ఏర్పడ కుండా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. బందరు ఆర్డీవో స్వాతి, డీపీఓ జె.అరుణ, బందరు డీఎస్పీ ఎండీఅబ్దుల్ సుభాని, డీఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ జె. గీతాబాయి, ఆర్టీసీ డిపో మేనేజర్ పెద్దిరాజులు, టూరిజం అధికారి రామ్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
బీచ్ వద్ద ఏర్పాట్లు పరిశీలించిన జాయింట్ కలెక్టర్, ఎస్పీ
Comments
Please login to add a commentAdd a comment