ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్ష స్వీకరణ మహోత్సవం సోమవారం వైభవంగా ప్రారంభమైంది. దుర్గమ్మ సన్నిధిలో శుక్రవారం నుంచి భవానీ మండల దీక్షలు ప్రారంభమయ్యాయి. మండల దీక్షల స్వీకరణ కార్తిక పౌర్ణమి శుక్రవారం వరకు కొనసాగుతుంది. తొలుత దుర్గమ్మ మూలవిరాట్‌కు పూజలు చేశారు. అనంతరం పగడాల దండను అలంకరించడంతో భవానీ దీక్షలు ప్రారంభమయ్యాయి. ప్రధాన ఆలయం నుంచి అమ్మవారి ఉత్సవ మూర్తిని ప్రత్యేకంగా అలంకరించి మహా మండపం ఆరో అంతస్తు వరకు ఊరేగింపు తీసుకొచ్చారు. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ వేద మంత్రోచ్ఛరణల మధ్య ముందుకు సాగగా భక్తులు జై భవానీ.. జైజై భవానీ అంటూ ఊరేగింపులో పాల్గొన్నారు. అమ్మవారికి ఆలయ గురు భవానీ యుద్దనపూడి నాగరాజుశాస్త్రి, వైదిక కమిటీ సభ్యులు శ్రీనివాసశాస్త్రి, పూజలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment