నేడు గురుదేవ్ రవిశంకర్ మహా సత్సంగం
భవానీపురం(విజయవాడపశ్చిమ): విజయవాడ భవానీపురంలో ఆధ్యాత్మిక తరంగాలు వీచనున్నాయి. అందుకు కరకట్ట సౌత్ రోడ్డు లోని బబ్బూరి గ్రౌండ్ వేదిక కానుంది. 13 ఏళ్ల సుదీర్ఘ కాలం తరువాత ఆధ్యాత్మిక ప్రవచన, ధ్యాన (మహా సత్సంగం) కార్యక్రమానికి ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మికవేత్త గురుదేవ్ రవిశంకర్ విజయవాడ విచ్చేయనున్నారు. బుధవారం సాయంత్రం ఆరు గంటలకు జరుగనున్న మహా సత్సంగంలో గురుదేవ్ రవిశంకర్ గానం.. జ్ఞానం.. ధ్యానం.. అంశాలపై ప్రవచించనున్నారు. ఇందుకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ యోగసాధకులు, కార్యకర్తలు విస్తృతమైన ఏర్పాట్లు చేస్తు న్నారు. విద్యార్థుల్లో ఏకాగ్రత, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు సత్సంగం దోహదపడుతుందని పేర్కొంటున్నారు.
నేటి నుంచి పొట్టి శ్రీరాములు కాలేజీలో చెస్ టోర్నమెంట్
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): పొట్టి శ్రీరాములు చలవాది మల్లికార్జునరావు కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో ఈ నెల 13, 14 తేదీల్లో జేఎన్ టీయూ కాకినాడ అంతర్ కళాశాలల చెస్ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నట్లు ఆ కళాశాల కార్యదర్శి అమర్‌సుధీర్ చెప్పారు. ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో టోర్నమెంట్ పోస్టర్‌ను అమర్‌సుధీర్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జేఎన్‌టీయూ కాకినాడ పరిధిలోని సుమారు 300 కళాశాలలు ఈ పోటీల్లో పాల్గొంటాయన్నారు. రెండు రోజుల పాటు ఉత్సాహపూరిత వాతావర ణంలో చెస్ టోర్నమెంట్‌ను నిర్వహిస్తామని చెప్పారు. విశ్వవిద్యాలయం చెస్ పోటీల పర్యవేక్షకునిగా హాజరైన డాక్టర్ పీఎస్ రాజు మాట్లాడుతూ.. చెస్ టోర్నమెంట్‌లో ఎంపికై న విద్యార్థులను డిసెంబర్ నాలుగు నుంచి ఏడో తేదీ వరకూ వెల్‌టెక్ యూనివర్సిటీ (చైన్నె)లో జరిగే అంతర్ విశ్వవిద్యాలయ టోర్నమెంట్‌లో పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల కోశాధికారి కె.రాఘవయ్య, ప్రిన్సిపాల్ శరవణకుమార్, అకడమిక్ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ.పతంజలి శాస్త్రి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్.మణికంఠ, ఫిజికల్ డైరెక్టర్ విక్టర్ జాన్సన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment