రాష్ట్రస్థాయి పవర్‌ లిఫ్టింగ్‌ విజేత పెడన టీమ్‌ | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి పవర్‌ లిఫ్టింగ్‌ విజేత పెడన టీమ్‌

Published Wed, Nov 13 2024 1:54 AM | Last Updated on Wed, Nov 13 2024 1:54 AM

రాష్ట్రస్థాయి పవర్‌ లిఫ్టింగ్‌ విజేత పెడన టీమ్‌

రాష్ట్రస్థాయి పవర్‌ లిఫ్టింగ్‌ విజేత పెడన టీమ్‌

పెడన: ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేటలో ఈ నెల 8, 9, 10వ తేదీల్లో జరిగిన రాష్ట్రస్థాయి పవర్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో పెడన క్రీడాకారులు విశేష ప్రతిభ కనబర్చి 19 పతకాలను సాధించారని పవర్‌ లిఫ్టింగ్‌ ఉమ్మడి కృష్ణాజిల్లా అధ్యక్షుడు పీవీకే సుబ్రహ్మణ్యం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పలు అన్యేకుప్పెడ్‌ (మోకాళ్లకు బ్యాండేజేస్‌ లేకుండా), ఇనేకుప్పెడ్‌ (మోకాళ్లకు బ్యాండేజేస్‌ ధరించి) బెంచ్‌ప్రెస్‌ విభాగాలలో 8 మంది క్రీడాకారులు ఆయా కేటగిరీలలో కలిపి 19 పతకాలను సాధించారన్నారు. 10 బంగారు పతకాలు, ఏడు వెండి, రెండు కంచు పతకాలు సాధించారు. ఈ పతకాలు సాధించిన వారంతా పెడనలోని గణేష్‌ జిమ్‌ సెంటర్‌లో శిక్షణ పొందిన వారే కావడం విశేషమని ఆయన తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement