ఏపీటీడీసీ పంచారామ యాత్ర ప్యాకేజీ
భవానీపురం(విజయవాడపశ్చిమ): పవిత్ర కార్తిక మాసంలో పంచారామాలు దర్శించుకునే భక్తుల కోసం ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ(ఏపీటీడీసీ) పంచారామ యాత్ర టూర్ ప్యాకేజీని ప్రకటించింది. కార్తిక సోమవారం రోజున ఉదయం ఐదు గంటలకు విజయవాడ నుంచి బయలుదేరిన బస్సు రాత్రి 11 గంటలకు తిరిగి విజయవాడకు చేరుకుంటుంది. ఈ పంచారామ యాత్రలో తొలుత అమరావతిలోని శ్రీఅమర లింగేశ్వర స్వామి ఆలయం, అక్కడ నుంచి భీమవరంలోని శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయం, పాలకొల్లులోని శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయం, ద్రాక్షారామంలోగల శ్రీభీమేశ్వర స్వామి ఆలయం, సామర్లకోటలోని శ్రీకుమార రామ స్వామి ఆలయానికి తీసుకువెళ్తారు. ఈ పంచారామ యాత్ర టూర్ ప్యాకేజీ పెద్దలకు రూ.1,400, పిల్లలకు రూ.1,120 (హైటెక్ నాన్ ఏసీ బస్సు)గా నిర్ణయించారు. ప్యాకేజీలో భాగంగా ప్రయాణికులకు ఉదయం అల్పాహారం ఏర్పాటు చేశారు. పంచారామ యాత్ర బస్ రిజర్వేషన్ కోసం tourism.ap.gov.in వెబ్‌సైట్‌లో చూడవచ్చు. మరిన్ని వివరాలకు 98480 07025 మొబైల్ నంబర్‌లోను, టోల్ ఫ్రీ నంబర్ 1800 4254 5454 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment