జూదరుల అరెస్ట్టు
పెడన: నడుపూరు పంచాయతీ మెరికేపాలెం సమీపంలోని పంట కాలువ గట్టుపై పేకాడుతున్నట్లు సమాచారం రావడంతో పెడన సర్కిల్ ఇన్స్పెక్టర్ కె.నాగేంద్రప్రసాద్, పెడన ఎస్ఐ–2 రాజేంద్రప్రసాద్‌లు తమ సిబ్బందితో దాడి చేశారు. బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత జరిగిన దాడిలో ఏడుగురు జూదరులను అరెస్ట్ చేసి వారి నుంచి రూ.68,700 నగదు స్వాధీనం చేసుకున్నారు. అక్కడ ఒక కారు, రెండు ద్విచక్ర వాహనాలు, ఆరు సెల్ఫోన్లను కూడా స్వాఽధీన పరుచుకున్నారు. జూదరులను గురువారం కోర్టుకు హాజరుపరిచారు.
కారుపై టీడీపీ స్టిక్కర్..
పేకాటలో పట్టుబడ్డ వారంతా ఆ కారులో ఆట స్థలానికి చేరినట్లుగా పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. ఓ కారు, రెండు ద్విచక్ర వాహనాలను స్టేషన్‌కు తరలించారు. బడుగు అనే పేరుతో పాటు టీడీపీ స్టిక్కర్ ఉన్న ఆ కారు బంటుమిల్లి మండలానికి చెందిన ఓ టీడీపీ నాయకుడిదని సమాచారం. జూదరులను తన కారులో తరలిస్తున్నారా..? టీడీపీ నాయకులే ఎవరైనా ఉన్నారా...? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు మాత్రం టీడీపీకి చెందిన వారెవ్వరు లేరని పేర్కొనడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment