బాలల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత
పెనమలూరు: బాలల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యతని ఏపీ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు బత్తుల పద్మావతి చెప్పారు. కానూరులోని ఎన్టీఆర్ జిల్లా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో యునిసెఫ్, మహితా ఎలయన్స్ ఫర్ చైల్డ్ రైట్స్ ఆధ్వర్యంలో గురువారం బాలల దినోత్సవం, స్టేట్‌చైల్డ్ పార్లమెంట్ వేడుకలు ఘనంగా చేశారు. ఈ సందర్భంగా పద్మావతి మాట్లాడుతూ బాలల చేతిలోనే దేశ నిర్మాణం ఉందన్నారు. బాలల హక్కుల పరిరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చైల్డ్ ప్రొటెక్షన్ మిషన్‌ను ఏర్పాటు చేశాయని తెలిపారు. బాల్య వివాహాలు, బాల కార్మికులు, చైల్డ్ ట్రాఫికింగ్ జరగకుండా ప్రత్యేకమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. చైల్డ్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ మస్తానయ్య మాట్లాడుతూ బాలలు తమ హక్కులు వినియోగించుకోవాలని సూచించారు. పీడీ ఉమాదేవి మాట్లాడుతూ బాలలపై లైంగిక వేధింపుల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు. హక్కుల మెమొరాండాన్ని బాలలు పద్మావతికి బాలలు అందజేశారు. కార్యక్రమంలో యూనిసెఫ్ ప్రతినిధి ప్రశుంశన్, మైనార్టీ హక్కుల సభ్యుడు ఫరూక్‌షుబ్లి, స్వచ్ఛంద సంస్థలు, వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment