ప్రతి సచివాలయం పరిధిలో వైద్య పరీక్షలు
జిల్లా వైద్యాధికారి గీతాబాయ్
పెనమలూరు: ప్రతి సచివాలయం పరిధిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తామని జిల్లా వైద్యాధికారి డాక్టర్ జి.గీతాబాయ్ అన్నారు. చోడవరంలో గురువారం కమ్యూనికబుల్, నాన్‌కమ్యూనికబుల్ డిసీజెస్(ఎన్‌సీడీసీడీ 3.0) కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించి వివరాలు తెలిపారు. ప్రతి సచివాలయం పరిధిలో 9 నెలల పాటు కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. వారంలో 45 కుటుంబాలకు వైద్య పరీక్షలు చేస్తామని తెలిపారు. ప్రధానంగా షుగర్, బీపీ పరీక్షలతో పాటు క్యాన్సర్‌కు సంబంధించి బ్రస్ట్, సర్వైకల్ పరీక్షలు చేస్తామన్నారు. క్యాన్సర్ ఉన్న వారికి వైద్య చికిత్సతో పాటు ఆహార అలవాట్లపై అవగాహన కల్పిస్తామన్నారు. ప్రతి వ్యక్తి ఎత్తు, బరువు, చుట్టు కొలత వంటి అంశాలు నమోదు చేస్తామని వివరించారు. కార్యక్రమంలో ఎన్‌సీడీ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ హిమబిందు, మండల వైద్యాధికారి బిజిలి శ్రీనివాసరావు, సీహెచ్‌వో విజయశ్రీ, ఏఎన్‌ఎం పుష్ప, సూపర్‌వైజర్ పురుషోత్తంరాజు, పీహెచ్‌ఎన్ లక్ష్మి వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment