కృష్ణాజిల్లా | - | Sakshi
Sakshi News home page

కృష్ణాజిల్లా

Published Fri, Nov 22 2024 2:00 AM | Last Updated on Fri, Nov 22 2024 2:00 AM

కృష్ణ

కృష్ణాజిల్లా

శుక్రవారం శ్రీ 22 శ్రీ నవంబర్‌ శ్రీ 2024

7

వైవీకి ఉమ్మడి కృష్ణాజిల్లా బాధ్యతలు

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): వైఎస్సార్‌ సీపీ ఉమ్మడి గుంటూరు జిల్లా రీజినల్‌ కోఆర్డినేటర్‌గా ఉన్న డాక్టర్‌ వైవీ సుబ్బారెడ్డికి ఉమ్మడి కృష్ణాజిల్లా బాధ్యతలు అప్పగించారు. ఈమేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.

ప్రభుత్వం ఫీజులు విడుదల చేయకపోవడంతో కళాశాల యాజమాన్యం పదేపదే అడుగుతోంది. దీంతో ఇబ్బందులు పడుతున్నాం. ఇంజినీరింగ్‌ ఫైనల్‌ ఇయర్‌ కావడంతో సెమిస్టర్‌ పరీక్షలకు ఇబ్బంది అవుతుందేమో అనే ఆందోళనగా ఉంది. వెంటనే ఫీజురీయింబర్స్‌మెంట్‌ మంజూరు చేసి ఆదుకోవాలి.

– ఎన్‌.ఎల్‌. విఠల్‌, బీటెక్‌ ఫైనల్‌ ఇయర్‌, పెడన.

పేదల చదువులు ప్రమాదంలో పడ్డాయి...ఐదేళ్లుగా నిరాటంకంగా సాగిన పేదల చదువులకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి...పాలిటెక్నిక్‌, ఐటీఐ, ఇంజినీరింగ్‌, డిగ్రీ చదువుతున్న పేద విద్యార్థులకు నేటివరకు ఫీజు రీయింబర్స్‌మెంటు నిధులు విడుదలగాక పోవడమే ఇందుకు ప్రధానకారణం. ఫీజుల కోసం కళాశాలలు ఒత్తిడి చేస్తుండటంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్న వైనంపై ప్రత్యేక కథనం.

సాక్షి, మచిలీపట్నం: ఉన్నత విద్య చదివే విద్యార్థుల్లో ఫీజు పరేషాన్‌ మొదలైంది. రాష్ట్రప్రభుత్వం ఉపకార వేతనాలు, ఫీజులను సకాలంలో మంజూరు చేయకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాలకు పేర్లు మార్చిన కూటమి ప్రభుత్వం, లబ్ధిదారులకు మాత్రం ఆయా పథకాలను అందించడం లేదు. అందులో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం ఒకటి. గత ఐదేళ్లుగా నిరాటంకంగా అందిన ఫీజు రీయింబర్స్‌మెంటు నిధు లను సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి చేస్తున్నాయి. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

ఫీజు చెల్లించలేక..సర్టిఫికెట్లు అందక..

2023–24 విద్యాసంవత్సరానికి సంబంధించి సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ ఏడాది మార్చి ఒకటో తేదీన అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కృష్ణా జిల్లాలోని 32,260మంది విద్యార్థులకు రూ.28.03కోట్లు విడుదల చేసింది. ఈ నిధులను నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమచేసింది. సార్వత్రిక ఎన్నికల అనంతరం అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం ఈ విద్యాసంవత్సరంలో జూన్‌, ఆగస్టు, నవంబర్‌ మాసాలకు సంబంధించి మూడు విడతలుగా విడుదల చేయాల్సిన ఫీజు రీయిం బర్స్‌మెంట్‌ నిధుల ఊసే మరిచింది. దీంతో రూ.50కోట్ల వరకు బకాయిలు విద్యార్థులకు అందాల్సి ఉంది. అదేవిధంగా జిల్లాలో ఈ ఏడాది ఇప్పటివరకు పీజురీయింబర్స్‌మెంటు కోసం 26,321 మంది రిజిస్టేషన్‌ చేసుకున్నారు. ఈప్రక్రియ కొనసాగుతోంది. అయితే జూన్‌ నుంచి ఇప్పటివరకు మూడు విడతలుగా ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంటు నిధులను ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇబ్బందులకు గురవుతున్నారు. సెమిస్టర్‌ పరీక్ష రాయాలంటే ఫీజు కడితేనే హాల్‌ టికెట్లు ఇస్తామని, కోర్సు పూర్తయిన విద్యార్థులు బకాయి ఫీజును చెల్లిస్తేనే సర్టిఫికెట్లు అందజేస్తామంటూ పలు కళాశాలల యాజమాన్యాలు చెబుతున్నాయి. దీంతో చెల్లించే స్థోమత లేక, సర్టిఫికెట్లు పొందలేక, పైచదువులకు వెళ్లలేక పేద విద్యార్థులు అవస్థలుపడుతున్నారు.

విద్యా దీవెన, వసతి దీవెన ఫీజులు మంజూరు చేయకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తల్లికి వందనం అని గత ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఆ విషయాన్ని విస్మరించి, ఊరూరా మద్యం షాపులు ఏర్పాటు చేసింది. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ఆయా నిధులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి.

– ఎండి. సాధిక్‌ బాబు,

ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి.

దీవెన..ఆవేదన..

గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ప్రతి మూడు నెలలకోసారి ‘జగనన్న విద్యాదీవెన’, ‘జగనన్న వసతి దీవెన’ పేరుతో విద్యార్థులకు ఆర్థికంగా అండగా నిలిచింది. ఏటా జూన్‌ మాసంలో విద్యా దీవెన నిధులు విడుదల చేసింది. అయితే ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ పథకాల పేర్లు మార్చడం వరకు పరిమితమైంది తప్ప అమలుపై ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. సజావుగా అమలవుతున్న పథకాలకు పేర్లు మార్చడంపై ఉన్న శ్రద్ధ నిధులు విడుదల చేయడంలో లేకపోవడంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెదవి విరుస్తున్నారు.

న్యూస్‌రీల్‌

దాళ్వా ఆశలపై నీళ్లు!

చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణాడెల్టా పరిధిలోని రైతులు రబీ పంటకు ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు మాత్రమే వేసుకోవాలని కలెక్టర్‌ డీకె బాలాజీ గురువారం ప్రకటించారు. ఈ ఏడాది ఇప్పటివరకు కృష్ణానదిలో ఎప్పుడూ రానివిధంగా వరద ప్రవాహం ఉన్నందున శ్రీశైలం, నాగార్జునసాగర్‌, ప్రకాశం బ్యారేజీ ద్వారా ఖరీఫ్‌ పంటకు సమృద్ధిగా 290 టీఎంసీల నీటిని సరఫరా చేశామన్నారు. గతనెల నుంచి కృష్ణానదిలో నీటిలభ్యత తగ్గిపోగా, ప్రస్తుతం జలశయాల్లో నిల్వ ఉన్న నీటిలో 167 టీఎంసీలను సాగులో ఉన్న ఖరీఫ్‌ పంటలకు సరఫరా చేయాల్సి ఉందన్నారు. 2025 జూన్‌ నెలాఖరు వరకు తాగునీటి కోసం 22టీఎంసీలతో కలిపి 185 టీఎంసీలు అవసరమవుతాయని పేర్కొన్నారు. పులిచింతల్లో ఇప్పుడున్న నీటి నిల్వ పరిమాణం 39 టీఎంసీలను తాగునీటికి, రాబోయే ఖరీఫ్‌ పంటకు ముందస్తుగా జూన్‌ నెలలోనే సరఫరా చేసేందుకు నిల్వ చేయాల్సి ఉంది. ఇందుకోసం రబీ పంటకు అవసరమైన నీటిని సరఫరా చేసేందుకు అవకాశం లేదని కలెక్టర్‌ స్పష్టం చేశారు. ఈనేపథ్యంలో ఆరుతడి పంటలను మాత్రమే వేసుకోవాలని రైతులకు సూచించారు.

ఐదేళ్లలో రూ.466.74 కోట్లు విడుదల..

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తమ పాలనలో జిల్లా లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన కింద రూ.466.74 కోట్లను విడుదల చేసింది. ఈ నిధులను 2,65,045 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసింది. వీటితోపాటు 2017–18, 2018–19లో చంద్రబాబు సర్కారు పెండింగ్‌లో పెట్టిన బకాయిలను సైతం విద్యార్థులకు అందించి వారిని ఆదుకుంది. కుటుంబ వార్షిక ఆదాయాన్ని అప్పటి టీడీపీ ప్రభుత్వం రూ.లక్షగా నిర్దేశిస్తే, ఎక్కువమందికి ప్రయోజనం చేకూరాలనే ఉద్దేశ్యంలో జగన్‌ ప్రభుత్వం ఆదాయం పరిమితిని రూ.2.50 లక్షలకు పెంచింది. ఇలా వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో జిల్లాలోని లక్షలాదిమంది విద్యార్థులకు వందలాది కోట్లను అందించి వారి అభ్యున్నతికి కృషిచేయగా.. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఫీజురీయింబర్స్‌మెంట్‌ నిధుల విడుదల చేయకుండా మిన్నకుంటుండటంతో పేదల చదువులకు పెద్దగండమే ఏర్పడినట్లయింది.

సంక్షేమ శాఖల వారీగా విద్యార్థుల వివరాలు

వెల్ఫేర్‌ శాఖ 2023–24 విడత–1 జమ అయిన రెన్యూవల్‌ 2024–25

విద్యార్థుల సంఖ్య సొమ్ము (రూ.కోట్లు) విద్యార్థులు కొత్త రిజిస్ట్రేషన్లు

ఎస్పీ వెల్ఫేర్‌ 7590 6.26 7605 5276

ఎస్టీ వెల్ఫేర్‌ 471 0.36 909 596

బీసీ వెల్ఫేర్‌ 14579 12.63 16615 12212

ఈబీసీ 2321 2.31 3769 2779

కాపు 5259 4.65 5118 3766

మైనారిటీ 2102 1.81 2054 1520

క్రిష్టియన్‌ మైనారిటీ 298 0.28 277 172

మొత్తం 32620 28.03 కోట్లు 36347 26321

No comments yet. Be the first to comment!
Add a comment
కృష్ణాజిల్లా1
1/9

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా2
2/9

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా3
3/9

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా4
4/9

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా5
5/9

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా6
6/9

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా7
7/9

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా8
8/9

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా9
9/9

కృష్ణాజిల్లా

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement