No Headline
మధుమేహం,రక్తపోటు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారు చలికాలంలో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. దగ్గు, జలుబు ఆయాసం వంటివి వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా వాకింగ్ చేసే వారు ఎండ వచ్చిన తర్వాత వెళ్తే మంచిదంటున్నారు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే చలికి ఎక్స్‌పోజ్ కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు అంటున్నారు. శ్వాస ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే చలికాలంలో అప్రమత్తంగా ఉండటంతో పాటు, వేడి ఆహారం తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు.
పోస్ట్ కోవిడ్ రోగుల్లోనూ..
ఇంకా పోస్టు కోవిడ్ రోగుల్లో వేర్వేరు దుష్ఫలితాలు కనిపిస్తూనే ఉన్నాయి. కొందరిలో షుగర్‌లెవల్స్ పెరుగుతుండగా, మరికొందరిలో గుండె సమస్యలు, బ్రెయిన్ స్ట్రోక్ గురైన వారు ఉంటున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. చలితో శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తవచ్చని సూచిస్తున్నారు. జలుబు, దగ్గుతో పాటు, ఆయాసం, న్యుమోనియా వంటివి సోకే ప్రమాదం లేకపోలేదంటున్నారు. చలిఎక్కువగా ఉన్నప్పుడు బయటకు రాకుండా ఉండటమే మేలని వైద్యులు సూచిస్తున్నారు.
శ్వాసకోశ వ్యాధిగ్రస్తులూ మరింత అప్రమత్తత అవసరం చలి ఎక్కువ ఉంటే బయటకు రాకుండా ఉండటం మంచిది చలితో గుండెపోటుకు గురయ్యే అవకాశం పోస్టు కోవిడ్ రోగులు జాగ్రత్తగా ఉండాలి సూర్యోదయం తర్వాత వాకింగ్ బెటర్
Comments
Please login to add a commentAdd a comment