అప్రమత్తంగా ఉండాలి
చలికాలంలో శ్వాసకోశ వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలి. నిర్లక్ష్యం చేస్తే ఒక్కోసారి ప్రాణాంతకంగా మారవచ్చు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు జలుబు, దగ్గును నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి. ఆస్తమా ఉన్న వారు చలిగాలులు తగలకుండా చూసుకోవాలి. చలితీవ్రత కారణంగా ఒక్కోసారి గుండెపోటుకు గురికావచ్చు. పోస్టు కోవిడ్ రోగుల్లోనూ చలికాలంలో ఊపిరితిత్తుల సమస్యలు వచ్చేఅవకాశం ఉంది. వర్షాకాలంలో దోమకాటుతో డెంగ్యూ, మలేరియా సోకినట్లు, చలికాలంలో శ్యాసకోశ వ్యాధులు ప్రబలుతాయి. ముందు జాగ్రత్తలు తీసుకోవడమే మంచిది.
– డాక్టర్ తిప్పరపు కార్తీక్,
శ్వాసకోశ వ్యాధుల నిపుణుడు
●
Comments
Please login to add a commentAdd a comment