యువతకు స్ఫూర్తిగా ‘యువ కెరటాలు’
చిలకలపూడి(మచిలీపట్నం): యువతలో స్ఫూర్తి, ఆత్మస్థయిర్యం నింపడానికి జనవరి మొదటి వారంలో యువ కెరటాలు నిర్వహించనున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర, కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో సోమవారం కలెక్టర్, జాయింట్ కలెక్టర్, అధికారులతో మంత్రి యువ కెరటాలు సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ యువతలో సృజన వెలికితీస్తే జీవితంలో ఎదుగుతారన్నారు. పాఠశాల, కళాశాలల స్థాయిలో విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ, క్విజ్ పోటీలు నిర్వహించి విజేతలకు జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహిస్తారని దీనికి చర్యలు తీసుకోవాలన్నారు. మంత్రి మాట్లాడుతూ మచిలీపట్నం పోర్టు పనులు, ఫిషింగ్ హార్బర్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, రెండు వారాలకోసారి పోర్టు పనులు సమీక్షిస్తున్నామన్నారు. అనంతరం కృష్ణ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో డిసెంబర్ 10 నుంచి 12 వరకు విజయవాడ కేబీఎన్ కళాశాలలో నిర్వహించే కృష్ణా తరంగ్ ఇంటర్ కాలేజీ.. యూత్ ఫెస్టివల్ బ్రోచర్‌ను రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె.శోభన్‌బాబు, రెక్టార్ బసవేశ్వరరావులతో కలిసి ఆవిష్కరించారు. సమావేశంలో జేసీ గీతాంజలి శర్మ, డీఆర్వో కె.చంద్రశేఖరరావు, ఆర్డీవో స్వాతి, డీఈవో రామారావు తదితరులు పాల్గొన్నారు.
మంత్రి కొల్లు రవీంద్ర
Comments
Please login to add a commentAdd a comment