రుణ సదుపాయం సద్వినియోగం చేసుకోవాలి
పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ హనుమంతరావు
మధురానగర్(విజయవాడసెంట్రల్): ప్రాథమిక సంఘ సభ్యులు జిల్లా యూనియన్‌లో సభ్యత్వం తీసుకుని తద్వారా రుణ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్, యూనియన్ ఫంక్షనల్ రిజిస్ట్రార్ డాక్టర్ ఎం.హనుమంతరావు సూచించారు. ముత్యాలంపాడులోని పశుసంవర్ధక శాఖ కార్యాలయం సమావేశ మందిరంలో బుధవారం ది కృష్ణాజిల్లా గొర్రెలు, మేకల పెంపకందారుల సహకార యూనియన్ లిమిటెడ్ సర్వసభ్య సమావేశం చైర్మన్ దుద్దుకూరి వెంకట కృష్ణారావు అధ్యక్షతన జరిగింది. కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఇప్పటి వరకు జిల్లా యూనియన్‌లో 125 ప్రాథమిక గొర్రెల పెంపకందారుల సహకార సంఘాలు ఉన్నాయన్నారు. అందులో 33 ప్రాథమిక సంఘాలకు గానూ 153 మందికి ఎన్‌సీడీసీ పథకం ద్వారా 20 శాతం రాయితీతో రుణం ఇచ్చామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ ద్వారా 50 శాతం రాయితీతో ఇచ్చే రుణ సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చైర్మన్ దుద్దుకూరి వెంకట కృష్ణారావు మాట్లాడుతూ మన జిల్లా యూనియన్ ద్వారా గొర్రెల పెంపకందారులకు 20 శాతం రాయితీతో రుణాలు ఇచ్చి వారి ఎదుగుదల, అభివృద్ధికి తోడ్పడినందుకు ఫంక్షనల్ రిజిస్ట్రార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశాన్ని కార్యనిర్వహణ అధికారి డాక్టర్ జి.ఉమ పర్యవేక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment