ఆత్మవిశ్వాసంతో ఏదైనా సాధించొచ్చు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం విజయవాడ డివిజన్‌లోని రైల్వే మినీ స్టేడియంలో దివ్యాంగుల స్పోర్ట్స్ మీట్ నిర్వహించారు. డీఆర్‌ఎం నరేంద్ర ఏ పాటిల్ స్పోర్ట్స్ మీట్‌ను ప్రారంభించారు. బ్లైండ్ క్రికెట్, వీల్ చైర్ రేసింగ్, అథ్లెటిక్స్, త్రో బాల్, షాట్‌పుట్ తదితర పోటీలలో విజయవాడ డివిజన్‌కు చెందిన 55 మంది దివ్యాంగ ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొని వారిలోని నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా డీఆర్‌ఎం మాట్లాడుతూ దివ్యాంగ ఉద్యోగుల్లోని ఆత్మస్థైర్యం, విశ్వాసం పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయన్నారు. డివిజన్‌లో 320 మంది దివ్యాంగ ఉద్యోగులు సమర్థంగా విధులు నిర్వర్తిస్తూ, రైల్వే అభివృద్ధిలో భాగస్వాములు అయ్యారని కొనియాడారు. వైకల్యం కేవలం శరీరానికి మాత్రమేనని, ధృడమైన మనస్తత్వంతో కలలను సులువుగా సాధించుకోవచ్చన్నారు.
దివ్యాంగుల స్పోర్ట్స్ మీట్‌ను ప్రారంభించిన డీఆర్‌ఎం నరేంద్ర ఏ పాటిల్
Comments
Please login to add a commentAdd a comment