కోర్టు కేసులపై దృష్టిసారించాలి
మచిలీపట్నంటౌన్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక ‘మీ కోసం’లో వచ్చిన అర్జీల్లో గడువు దాటిన అర్జీలు, పెండింగ్ కోర్టు కేసులపై దృష్టి సారించాలని సంబంధిత అధికారులను జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జేసీ అధ్యక్షతన సోమవారం మీ కోసం కార్యక్రమం జరిగింది. జేసీ గీతాంజలిశర్మ మాట్లా డుతూ.. గడువులోగా అర్జీలు పరిష్కరించాలన్నారు. వివిధ శాఖల్లో పెండింగ్ కోర్టు కేసులు సమీక్షించారు. కోర్టు ధిక్కరణ కేసుల్లో ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు సమీక్షించి, సకాలంలో కోర్టు ఆదేశాల అమలుకు చర్యలు తీసుకో వాలని సూచించారు. ఈ నెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహణకు ఏర్పాట్లు చేయా లని ఆదేశించారు. 26వ తేదీన గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని, కలెక్టర్ ప్రసంగాన్ని సిద్ధం చేయాలని, వివిధ శాఖలలో ఉత్తమ సేవలు అందించిన అధికారులు, ఉద్యోగులకు ప్రశంస పత్రాలు ప్రదానం చేసేందుకు వెంటనే పేర్లు పంపాలని అధికారులను ఆదేశించారు. అనంతరం వైద్య ఆరోగ్య శాఖ ద్వారా కుష్ఠు వ్యాధి అవగాహన కార్యక్రమంపై ముద్రించిన పోస్టర్లు, కరపత్రాలను జాయింట్ కలెక్టర్ విడుదల చేశారు. జిల్లాలో కుష్ఠు వ్యాధిపై అవగాహన కల్పించేందుకు ఇంటింటి సర్వే ప్రారంభించి ఫిబ్రవరి రెండో తేదీ వరకు నిర్వహిస్తామని, వివిధ శాఖల అధికారులు సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. బందరు ఆర్డీఓ కె.స్వాతి, సివిల్ సప్లయీస్ డీఎం పద్మాదేవి, మెప్మా పీడీ సాయిబాబు తదితరులు ప్రజల నుంచి 142 అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ కె.కన్నమనాయుడు, పంచాయతీరాజ్ ఎస్‌ఈ రమణరావు, డ్వామా పీడీ కె.వి.శివప్రసాద్, జిల్లా వ్యవసాయ అధికారి ఎన్.పద్మావతి, నగరపాలక సంస్థ కమిషనర్ బాపిరాజు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
జేసీ గీతాంజలిశర్మ
Comments
Please login to add a commentAdd a comment