బతుకుబండిపై పగ
● బందరులో చిరు వ్యాపారులపై పగబట్టిన కూటమి నాయకులు ● ఎన్నికల్లో కూటమికి సహకరించలేదని అక్కసు ● రోడ్ల పక్కన ఉన్న తోపుడు బండ్లు తొలగింపు ● గతంలో ఈట్ స్ట్రీట్, జెడ్పీ సెంటర్, బస్టాండ్ వద్ద ఇదే తరహా చర్యలు ● తాజాగా రైతుబజార్, కోనేరుసెంటర్‌లో దుకాణాల తొలగిపునకు యత్నం ● ఉపాధి కోల్పోయి కూరగాయలు, పండ్ల వ్యాపారులు విలవిల
ఈ చిత్రంలో కనిపిస్తున్న మహిళ పేరు కోట వెంకటేశ్వరమ్మ. బందరు మండలం మంగినపూడి వాసి. 30 ఏళ్లకు పైగా బందరు ప్రధాన రహదారి మార్జిన్‌లో ఉదయం పూట కూరగాయలు, పూలు, ఆకుకూరలు విక్రయిస్తోంది. మూడు రోజుల క్రితం మునిసిపల్ అధికా రులు ట్రాక్టర్లతో వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేయకూడదని హెచ్చరించారు. వైఎస్సార్ సీపీ నాయకులు మద్దతుగా రావడంతో దుకా ణాలను తొలగించలేదని వెంకటేశ్వరమ్మ పేర్కొన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో ఆశీలును రద్దుచేసి ఆదుకున్నారని గుర్తుచేశారు.
ఈ చిత్రంలోని వ్యక్తి పేరు సుంకర ఏసు. బుట్టాయిపేటలో నివసిస్తున్నారు. టీడీపీ వాణిజ్య విభాగం నాయకుడు. మార్కెట్‌లో కోళ్ల వ్యాపారం చేస్తున్నారు. వైఎస్ జగన్ పాలన నుంచి కోళ్లకు ఆశీలు వసూలు చేయలేదని, టీడీపీ పాలనలో రశీదు ఇవ్వకుండా కోడికి రూ.20 నుంచి రూ.30 చొప్పున ఆశీలు వసూలు చేస్తున్నారని చెబుతు న్నారు. మునిసిపల్ ఉద్యోగి మల్లేశ్వరరావు మరో ఇద్దరు కోళ్ల వ్యాపారుల వద్ద ఆశీలు వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని మునిసిపల్ కమిషనర్ బాపిరాజు దృష్టికి ఏసు తీసుకెళ్లారు.
●
Comments
Please login to add a commentAdd a comment