పెనమలూరు: పోరంకిలో అత్తను చంపిన అల్లుడిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. పెనమలూరు సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం నిజామాబాద్‌లోని ఉన్నాజిపేటకు చెందిన నారబోయిన నరేష్ కొన్నేళ్ల క్రితం పోరంకికి చెందిన స్వర్ణలతను వివాహం చేసుకున్నాడు. ఆరు నెలల క్రితం స్వర్ణలత పుట్టింటికి వచ్చి తల్లి ఉమ్మడి రాణి (65)తో కలిసి తన ఇద్దరు కుమార్తెలతో ఉంటోంది. నరేష్ దురలవాట్లకు బానిసగా మారడంతో భార్య స్వర్ణలత పోలీసులకు ఫిర్యాదు చేయగా అతను విజయవాడలో వేరుగా ఉంటున్నాడు. అప్పుడప్పుడు పోరంకి వచ్చి పిల్లలను చూసి వెళ్లేవాడు. అతని పేరున ఉన్న పొలం పిల్లలకు రాయాలని భార్య, అత్త కొంతకాలంగా నరేష్‌ను కోరుతున్నారు. దీంతో వారిపై నరేష్ కక్ష పెంచుకున్నాడు. ఈ నెల 9వ తేదీ ఉదయం నరేష్ పోరంకిలోని అత్త ఉమ్మడిరాణి ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో అత్త రాణి ఇంటి బయట బ్రష్ చేస్తుండగా ఆమైపె నరేష్ దాడి చేశాడు. ఆమె కిందపడిపోగా రాయితో ఆమె తలపై బలంగా కొట్టగా మరణించింది. నిందితుడు పారిపోయాడు. ఘటనపై స్వర్ణలత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హత్య కేసు నమోదు చేశారు. పోలీసులు నిందితుడిని శుక్రవారం అరెస్టు చేసి కోర్టుకు హాజరుపర్చగా కోర్టు రిమాండ్ విధించింది.
Comments
Please login to add a commentAdd a comment