ప్రభుత్వమే ఫీజు చెల్లించింది
నేను బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నా. మా తండ్రి ఎస్.రహంతుల్లా బంగారు షాపులో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆయనకు వచ్చే ఆదాయంతో బీటెక్ చదివే పరిస్థితులు లేవు. అయితే జగనన్న ఇస్తున్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో బీటెక్ విద్యను పూర్తి చేస్తున్నా. మూడేళ్లుగా ప్రభుత్వమే ఫీ జు చెల్లిస్తోంది. పేదల ఉన్నత చదువులకు జగనన్న బాసటగా నిలుస్తున్నారు. – ఎస్.తానియా
సంతోషంగా చదువుకుంటున్నా
నేను బీఎస్సీ నర్సింగ్ మొదటి సంవత్సరం చదువుతన్నా. మా తండ్రి వృత్తిరీత్యా ఆటో డ్రైవర్. రోజు కష్టపడితే తప్ప ఇల్లు గడవదు. ప్రతి నెలా ఇంటి అద్దె కోసం ఎంతో ఇబ్బంది పడుతుంటాం. బీఎస్సీ నర్సింగ్ చేయాలంటే డబ్బు కావాలి. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం మమ్మల్ని ఆదుకుంది. జగనన్న విద్యా దీవెన పథకం కింద రెండు విడతలుగా మా అమ్మ ఖాతాలో నగదు జమ అయ్యింది. ఆ డబ్బును కాలేజీలో కట్టి నేను సంతోషంగా చదువుకుంటున్నా. – జి.శ్వేత
కర్నూలు(సెంట్రల్): ఆటంకం లేకుండా పేద విద్యార్థులు చదువు కొనసాగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాలు అమలు చేస్తూ ఆర్థిక భరోసా ఇస్తోందని ఎంపీ డాక్టర్ సంజీవ్‌కుమార్, ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, హఫీజ్‌ఖాన్, సుధాకర్, మేయర్ బీవై రామయ్య అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పూర్తిస్థాయి ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం జగనన్న విద్యా దీవెన పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. అంతేగాక చదువుకునే సమయంలో విద్యార్థుల వసతి, చేతి ఖర్చుల కోసం జగనన్న వసతి దీవెన కింద యేటా రూ.20 వేలను జమ చేస్తున్నారన్నారు. శుక్రవారం సీఎం వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నుంచి జగనన్న విద్యా దీవెనలో భాగంగా జూలై 2023 నుంచి సెప్టెంబర్ 2023 త్రైమాసికానికి సంబంధించిన నిధులను బటన్ నొక్కి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు. ఈ కార్యక్రమాన్ని కలెక్టరేట్ నుంచి వర్చువల్‌గా జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన, ఎంపీ, మేయర్, ఎమ్మెల్యేలు, డిప్యూటీ మేయర్ రేణుకారెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ శిరోమణి మద్దయ్య తదితరులు వీక్షించారు. అనంతరం వారు మాట్లాడుతూ... చదువుతో పేదరికాన్ని దూరం చేయవచ్చన్నారు. పేదల చదువు కోసం సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎంత ఖర్చుకై నా వెనుకాడడం లేదన్నారు. ఐదేళ్లలో విద్యపై రూ. 75 లక్షల కోట్లు ఖర్చు చేశారన్నారు. అమ్మ ఒడి, విద్యా కానుక, నాడు–నేడు, జగనన్న విదేశీ విద్యా పథకాల ద్వారా పేద విద్యార్థులకు ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలను సద్వినియోగం చేసుకుని జీవితంలో ఉన్నత స్థానంలో స్థిరపడాలన్నారు. జగనన్న విద్యా దీవెన కింద కర్నూలు జిల్లాలో 33,297 మంది విద్యార్థులకు సంబంధించి 30,479 మంది తల్లుల బ్యాంక్ ఖాతాల్లో రూ.21.92 కోట్లను జమ చేసినట్లు చెప్పారు. అనంతరం అధికారులు, ప్రజాప్రతినిధులు విద్యార్థులు, వారి తల్లులకు మెగా చెక్కును అందజేశారు.
బటన్ నొక్కి ఫీజురీయింబర్స్‌మెంట్
నిధులు జమ చేసిన సీఎం వైఎస్ జగన్
జిల్లాలో 30,479 మంది తల్లుల
ఖాతాల్లో రూ.21.92 కోట్లు జమ
విద్యార్థులు, వారి తల్లులకు
మెగా చెక్కును అందించిన
జిల్లా కలెక్టర్, ఎంపీ, ఎమ్మెల్యేలు
Comments
Please login to add a commentAdd a comment