భర్తను చంపిన భార్య | - | Sakshi
Sakshi News home page

భర్తను చంపిన భార్య

Published Mon, Nov 25 2024 7:44 AM | Last Updated on Mon, Nov 25 2024 7:44 AM

-

కర్నూలు (టౌన్‌): వారిద్దరు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఆరేళ్ల సంసార జీవితంలో పొరపొచ్చాలు వచ్చాయి. అంతే.. ఆదివారం ఉదయం భర్తను భార్య కడతేర్చింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలివీ.. కర్నూలు మండల పరిధిలోని ప్రజానగర్‌లో కరగల్లు చిన్నా (25) కుటుంబం నివశిస్తోంది. భార్య స్వరూపారాణిని ఆరేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక బాబు, పాప ఉన్నారు. చిన్నా ఆటోడ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే దంపతులు తరచూ గొడవ పడేవారు. ఈ క్రమంలో ఆదివారం తీవ్రస్థాయిలో గొడవపడ్డారు. క్షణికావేశానికి గురైన స్వరూపరాణి భర్త తలపై ఇనుప రాడ్‌తో పదే పదే కొట్టడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే చనిపోయాడు. అనంతరం ఆమె నేరుగా తాలుకా పోలీసుస్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. చుట్టుపక్కల వారు ఇచ్చిన సమాచారం మేరకు మృతుడి తల్లి పద్మావతి ఘటనా స్థలానికి చేరుకుంది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు తాలుకా సీఐ శ్రీధర్‌ వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement