ఎరక్కపోయి ఇరుక్కున్న లారీ
షార్ట్‌కట్‌లో వెళ్లాలన్న తొందరపాటుతో ఊహించని రీతిలో లారీ ఇలా ఇరుక్కుపోవడంతో నగరవాసులకు ట్రాఫిక్ చుక్కలు కనిపించాయి. దీంతో లారీడ్రైవర్ అందరితో చీవాట్లు తింటూ పోలీసులకు అడ్డంగా బుక్కయ్యాడు. వివరాలు.. రాయచోటి నుంచి నంద్యాలకు పత్తి బేళ్ల లోడుతో బయలుదేరిన లారీ బైపాస్ రోడ్డులో వెళ్లకుండా షార్ట్‌కట్‌లో వెళ్లేందుకు బళ్లారి చౌరస్తా వద్ద నగరంలోకి ప్రవేశించింది. లోడ్ ఎక్కువ ఎత్తు ఉండడంతో కేసీ కెనాల్ బ్రిడ్జి అండర్ పాస్ కిందకు రాగానే లారీ అడ్డంగా ఇరుక్కుపోయింది. ఉన్న రెండు అండర్‌పాస్‌లలో ఒకటి లారీ ఇరుక్కొని బ్లాక్ కావడంతో ట్రాఫిక్ స్తంభిచింది. దీంతో వాహనదారులు ఒకే అండర్‌పాస్‌లో రాకపోకలు సాగిస్తూ ఐదారు గంటలపాటు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. చివరకు ట్రాఫిక్ పోలీసులు వచ్చి పత్తి బేళ్లను కిందికి దించి లారీని వెనక వైపు నుంచి బయటకు తీయడంతో సమస్య పరిష్కారమైంది.
– కర్నూలు న్యూసిటీ
Comments
Please login to add a commentAdd a comment