ఆంగ్ల నైపుణ్యం.. గణిత మేధస్సు
● సాక్షి ఆధ్వర్యంలో నిర్వహించిన
స్పెల్‌బీ, మ్యాథ్స్ బీ పరీక్షలకు
విశేష స్పందన
● రెండో దశ పోటీలకు
118 మంది విద్యార్థుల హాజరు
● నాలుగు విభాగాలుగా విద్యార్థులను
వర్గీకరించి నైపుణ్య పరీక్షలు
● ఎంతో ఉపయోగమని సంతోషం
వ్యక్తం చేసిన విద్యార్థులు,
వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు
కర్నూలు(సెంట్రల్): సాక్షి, ఎరీనా స్కూలు ఫెస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్పెల్‌బీ, మ్యాథ్స్‌బీ పరీక్షలకు విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించింది. ఆదివారం నగరంలోని రవీంద్ర విద్యానికేతన్‌లో నిర్వహించిన పరీక్షలకు 118 మంది విద్యార్థులు హాజరవ్వగా.. గణితంలో సందేహాల నివృత్తి.. ఇంగ్లిష్‌లో కష్టమైన పదాలకు సులభంగా అర్థాలు నేర్చుకున్నారు. ఈ పరీక్షలు తమ భవిష్యత్‌కు మార్గదర్శకంగా నిలుస్తాయని, పై తరగతుల్లో రాణించేందుకు ఉపయుక్తంగా ఉన్నాయని విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు.
నాలుగు విభాగాలుగా నైపుణ్య పరీక్షలు
‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్పెల్‌బీ, మ్యాథ్స్‌బీ పరీక్షలు ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత స్థాయి తరగతుల విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటున్నాయి. ప్రతి సంవత్సరం నిర్వహించే పరీక్షలకు వందలాది మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటున్నారు. గ్రామీణ, పట్టణ నేపథ్యాలు ఉన్నా విద్యార్థులు ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తున్నారు. దరఖాస్తు చేసుకున్న వారిలో వారీ తరగతి నైపుణ్యాలను బట్టి రెండో దశకు ఎంపిక చేస్తారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఇంగ్లిష్‌లో నైపుణ్యం సంపాదించుకోవాలని, మ్యాథ్స్‌లో పట్టు సాధించాలన్న దృఢ సంకల్పంతో స్పెల్‌బీ, మ్యాథ్స్‌బీ పరీక్షలను ప్రతి సంవత్సరం 1, 2 తరగతుల విద్యార్థులను ఒక్క గ్రూపుగా 3, 4, 5 తరగతుల వారిని రెండో గ్రూపుగా 6, 7 తరగతుల విద్యార్థులను మూడో గ్రూపుగా 8, 9, 10 తరగతుల వారిని నాలుగో గ్రూపుగా వర్గీకరించి పరీక్షలు నిర్వహిస్తారు. రెండో దశలో ఎంపికై న విద్యార్థులకు రీజనల్ స్థాయిలో, అందులో ఎంపికై న వారికి ఫైనల్ స్థాయిలో పోటీ పరీక్షలు ఉంటాయి. ఆదివారం కర్నూలులో జరిగిన రెండో దశ పరీక్షలకు స్పెల్‌బీ నుంచి 63, మ్యాథ్స్‌బీ నుంచి 55 మంది విద్యార్థులు హాజరయ్యారు. స్పెల్‌బీ పరీక్షలకు హాజరైన విద్యార్థులు ప్రనౌన్షియేషన్, కష్టమైన పదాలకు సులభంగా స్పెల్లింగ్‌లు రాయడం, స్పీచ్, లిజనింగ్ (వినడం) తదితర విభాగాల్లో పట్టు సాధిస్తారు. అలాగే మ్యాథ్స్‌బీ ద్వారా వారిలోని భయాన్ని తొలగించి చిన్న, చిన్న ట్రిక్కులతో సమస్యలను సులభంగా సాధన చేసేలా చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment