కర్నూలు కల్చరల్: డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీలో 2024–25 విద్యా సంవత్సరానికి పీజీ కోర్సుల్లో మిగిలిన సీట్లకు స్పాట్ అడ్మిషన్లకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి.లోకనాథ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పీజీ సెట్‌లో అర్హత సాధించని, పీజీ సెట్ 2024 పరీక్షకు హాజరు కాని అర్హత గల అభ్యర్థులతో స్పాట్ అడ్మిషన్స్ కింద సీట్లను భర్తీ చేసుకునేందుకు అనుమతిస్తూ జీవో నెంబర్ 172ను రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ ప్రభుత్వ కార్యదర్శి ఉత్తర్వులను జారీ చేసినట్లు తెలిపారు. పీజీ కోర్సుల్లో పరిమిత సంఖ్యలో సీట్లు ఉన్న ఎంఏ ఇంగ్లిష్, ఎంఏ ఎకనామిక్స్, ఎంఏ ఉర్దూ, ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్, ఎమ్మెస్సీ బాటనీ, ఎమ్మెస్సీ జువాలజీ, ఎమ్మెస్సీ ఇండస్ట్రియల్ కెమిస్ట్రీలో అర్హత గల విద్యార్థులు స్పాట్ అడ్మిషన్స్ కింద అడ్మిషన్ పొందవచ్చని పేర్కొన్నారు. ఆసక్తి గల విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్స్‌తో ఈనెల 29వ తేదీ వర్సిటీ కార్యాలయంలో హాజరై ప్రభుత్వ నిబంధనల ప్రకారం అడ్మిషన్ పొందవచ్చని పేర్కొన్నారు. స్పాట్ అడ్మిషన్ల కింద అడ్మిషన్ పొందిన వారు ప్రభుత్వ ఫీజు రీయింబర్స్‌మెంట్ సదుపాయానికి అర్హులు కారని తెలిపారు. వివరాలకు 83415 11632, 99597 58609 ను సంప్రదించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment