విజిబుల్ పోలీసింగ్‌తోనే నేర నివారణ సాధ్యం
కర్నూలు: విజిబుల్ పోలీసింగ్‌తోనే నేరాల నివారణ సాధ్యమని ఎస్పీ బిందు మాధవ్ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలతో గురువారం ఎస్పీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. కర్నూలు, పత్తికొండ, ఆదోని, ఎమ్మిగనూరు సబ్ డివిజన్లలో దీర్ఘకాలికంగా ఉన్న పెండింగ్ కేసుల గురించి సమీక్షించి వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై తగు సూచనలు ఇచ్చారు. స్టేషన్ల వారీగా కేసుల పెండింగ్‌కు గల కారణాలను ఈ సందర్భంగా అడిగి తెలుసుకున్నారు. ఏడాది ముగింపులో ప్రాపర్టీ కేసులలో రికవరీ శాతం పెంచాలని, విచారణ దశలో ఉన్న కేసులను పూర్తిగా తగ్గించాలని ఆదేశించారు. ఎవరినైనా అరెస్టు చేసేముందు అందుకు సంబంధించిన విషయాలను తెలియజేయాలని సూచించారు. పోక్సో కేసులలో, పెండింగ్ ట్రయల్ కేసులలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో మాట్లాడి ముద్దాయిలకు శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
లోక్ అదాలత్‌లో కేసులు తగ్గించాలి..
లోక్ అదాలత్‌లో కాంపౌండబుల్ కేసులను తగ్గించేందుకు స్టేషన్ల వారీగా అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే రోడ్డు ప్రమాదాలు జరగకుండా సంబంధిత శాఖల సమన్వయంతో చర్యలు తీసుకోవాలన్నారు. ప్రమాద బాధితులకు తగిన నష్ట పరిహారం వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో ఎవరైనా సైబర్ నేరాల బారిన పడితే వెంటనే 1930కి ఫిర్యాదు చేసే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
ప్రతిభకు అభినందనలు...
ప్రాపర్టీ కేసులు, వార్షిక ఫైరింగ్ సాధనలో ప్రతిభ కనపరచిన అధికారులను, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కరపత్రాలను ఎస్పీ ఆవిష్కరించారు. ఆయా సబ్ డివిజన్లలో ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. అడిషనల్ ఎస్పీ అడ్మిన్ హుసేన్ పీరా, లీగల్ అడ్వైజర్ మల్లి కార్జున రావు, డీఎస్పీలు బాబుప్రసాద్, సోమన్న, వెంకటరామయ్య, ఉపేంద్ర బాబు, ట్రైనీ డీఎస్పీ ఉషశ్రీతో పాటు సీఐలు, ఎస్‌ఐలు సమీక్షలో పాల్గొన్నారు.
నేర సమీక్ష సమావేశంలో
ఎస్పీ బిందు మాధవ్
Comments
Please login to add a commentAdd a comment