సాగునీటి సంఘాల ఎన్నికలు సజావుగా నిర్వహించండి
కర్నూలు(సెంట్రల్): సాగునీటి సంఘాల ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని జలవనరుల శాఖ స్పెషల్ సీఎస్ జ.సాయిప్రసాదు అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సాగునీటిసంఘాల నిర్వహణపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఓటరు జాబితాలో తప్పొప్పులకు తావు లేకుండా రూపొందించాలన్నారు. సిద్ధమైన జాబితాలను ప్రజలకు అందుబాటులో ఉంచి అనర్హులు ఉంటే తగిన ఆధారాలతో తీసి వేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. ఈ ఎన్నికులకు సంబంధించి డిసెంబర్ 5వ తేదీన నోటిఫికేషన్ వస్తుందన్నారు. డిసెంబర్ 8వ తేదీన ప్రాదేశిక నియోజకవర్గం, వాటర్ యూజర్స్ అసోసియేషన్ ఎన్నికలు ఉంటాయని, డిస్ట్రిబ్యూటరీ కమిటీలకు 11వ తేదీన, ప్రాజెక్టు కమిటీలకు 14వ తేదీన ఎన్నికలు ఉంటాయన్నారు. ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్లో జేసీ డాక్టర్ బి.నవ్య, ఇరిగేషన్ ఎస్ఈ బాలచంద్రారెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment