పూలే అణగారిన వర్గాల ఆశాజ్యోతి
కర్నూలు(అర్బన్): అణగారిన వర్గాల అభ్యున్నతికి, మహిళల విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేసిన మహోన్నత వ్యక్తి మహాత్మాజ్యోతిరావు పూలే అని జిల్లా కలెక్టర్ పీ రంజిత్‌బాషా కొనియాడారు. గురువారం ఫూలే 134వ వర్దంతి సందర్భంగా స్థానిక బిర్లాగేట్ కూడలిలో ఉన్న జ్యోతిరావు పూలే విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సామాజిక అంతరాలను తొలగించేందుకు ఆయన అనేక పోరాటాలు నిర్వహించారన్నారు. బాలికలకు ప్రత్యేకంగా పాఠశాలను స్థాపించి సీ్త్ర విద్యను ప్రోత్సహించారన్నారు. సామాజిక తత్వవేత్త, ఉద్యమకారుడు, సంఘ సేవకులైన జ్యోతిరావు పూలే మానవ హక్కుల కోసం అనేక పోరాటాలు చేశారన్నారు. అట్టడుగు, బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలిచిన వ్యక్తి ఫూలేను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకొని వారి ఆశయాల సాధనకు, ఉన్నత సమాజ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమం, సాధికారత అధికారిణి వెంకటలక్షుమ్మ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు, బీసీ జేఏసీ కన్వీనర్ దేవపూజ ధనుంజయ ఆచారి, పలువురు బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ రంజిత్‌బాషా
Comments
Please login to add a commentAdd a comment