మహిళా అభ్యున్నతికి చర్యల్లేవు
స్వయం సహాయక సంఘాల మహిళలు ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఐదు నెలలు అయినా మహిళ అభ్యన్నతికి చర్యలు తీసుకోలేదు. స్వయం సహాయక సంఘాల మహిళలు ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. గత ప్రభుత్వం చేయూత, ఆసరా, వడ్డీలేని రుణాలు వంటి కార్యక్రమాలు అమలు చేసింది. పొదుపు మహిళల్లో అసంతృప్తి పెరగకముందే తగిన చర్యలు తీసుకోవాలి.
– చంద్రమ్మ, మండల సమాఖ్య అధ్యక్షురాలు, తుగ్గలి మండలం
చేయూత కోసం ఎదురు చూస్తున్నాం
నేను కౌతాళంలోని హాజీ మలాంగ్ బాబా స్వయం సహాయక సంఘంలో సభ్యురాలుగా ఉన్నాను. ఈ ప్రభుత్వం ఇంతవరకు మహిళల సంక్షేమానికి సంబంధించి ఒక్క పథకం కూడా అమలు చేయక పోవడం ఆందోళన కలిగిస్తోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు తల్లికి వందనం, సున్నా వడ్డీ రుణాలు, చంద్రన్న బీమా తదితర పథకాలను అమలుపై ముఖ్యమంత్రి చొరవ తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది.
– అఫ్రీన్, పొదుపు మహిళ, కౌతాళం
●
Comments
Please login to add a commentAdd a comment