గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి అందించిన
ప్రయోజనం పొందిన
ఆర్థిక లబ్ది (రూ.కోట్లలో)
పేరు మార్చి.. బీమా మరిచి!
తాము అధికారంలోకి రాగానే ప్రమాదవశాత్తూ జరిగే మరణాలకు రూ.10 లక్షలు, సహజ మరణాలకు రూ.5 లక్షలకు బీమా సదుపాయం కల్పిస్తామని కూటమి నేతలు స్పష్టంగా హామీ ఇచ్చారు. అయితే వైఎస్సార్ బీమాను చంద్రన్న బీమాగా పేరు మార్చడం మినహా ఎటువంటి పురోగతి లేదు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత చంద్రన్న బీమా అమలు జాడనే లేకుండా పోయింది. జూలై నుంచి అక్టోబరు నెల వరకు ప్రమాద, సహజ మరణాలకు సంబంధించి దాదాపు 750 క్లైమ్‌లు రిజిస్టర్ అయినా ఇంతవరకు ఒక్క క్లైమ్ కూడా సెటిల్ కాలేదు. కుటుంబానికి ఆధారమైన వారిని పోగొట్టుకున్న ఎన్నో కుటుంబాలు చంద్రన్న బీమాపై ఆశలు పెట్టుకున్నాయి.
ఐదేళ్లు మహిళా సంక్షేమం కళకళ
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మహిళల సంక్షేమమే లక్ష్యంగా అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఐదేళ్లు వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా, జగనన్న తోడు, కళ్యాణమస్తు– షాదీతోపా, సున్నా వడ్డీ రుణాలు, వైఎస్సార్ బీమా పథకాలను పకడ్బందీగా అమలు చేసింది. కరోనా విపత్తులో వెనుకడుగు వేయకుండా మహిళకు చేయూత అందించింది. ఈ పథకాల కింద ఐదేళ్లలో మహిళలకు దాదాపు రూ.1810.45 కోట్ల మేర ప్రయోజనం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడి 5 నెలలు గడచినప్పటికీ మహిళల సంక్షేమానికి ఒక్క రూపాయి కూడా విదిల్చలేదు. దీంతో మహిళలు కూటమి ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారు. మహిళల్లో కొనుగోలు సామర్ధ్యం భారీగా పడిపోయింది.
లబ్ధిపొందిన మహిళలు
Comments
Please login to add a commentAdd a comment