జిల్లా పశ్చిమ ప్రాంతానికి తుంగభద్ర జలాలే ప్రధాన నీటి వన
కేసీ వాటా మళ్లింపు అడ్డుకోకుంటే కన్నీటి కష్టాలే..
తుంగభద్ర జలాల్లో కేసీ కాలువకు 39.9 టీఎంసీల నీటి వాటా ఉంది. ఇందులో టీబీ డ్యాంలోని నిల్వ నీటిలో 10 టీఎంసీల నీటి వాటా ఉంది. ఈ ఏడాది 9.05 టీఎంసీల నీటిని కేటాయించారు. ఇందులో ఇంత వరకు చుక్క నీరు వాడలేదు. అయితే ఈ నీటిని అనంతపురం జిల్లా హెచ్చెల్సీకి మళ్లించుకునేందుకు అక్కడి నేతలు ప్రభుత్వాన్ని ఇప్పటికే కోరినట్లు తెలుస్తోంది. ఈ నీటి మళ్లింపును అడ్డుకోకపోతే తుంగభద్ర నది తీరంలోని లిఫ్ట్‌ల పరిధిలో సాగైన ఆయకట్టు, తీర గ్రామాల ప్రజలతో పాటు, కర్నూలు నగరపాలక సంస్థ ప్రజలు తాగు నీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. జిల్లా పరిధిలో కేసీ కింద 3 వేలకుపైగా ఆయకట్టు ఉంది. ఈ ఆయకట్టుకు రబీలో నీరు వదిలే అంశంపై ఇంత వరకు ఎలాంటి స్పష్టత రాలేదు.
● దిగువ కాల్వ కింద రబీలో
1.7 లక్షల ఎకరాల సాగు
● ఈ ఏడాది ఏపీ వాటా
21.7 టీఎంసీలు
● ఇప్పటి వరకు 8.5 టీఎంసీల
వినియోగం
● నీరున్నా శిథిలావస్థ కాల్వలతో
చివరి ఆయకట్టు ప్రశ్నార్థకం
● తాగునీటి అవసరాల పేరుతో
ఆయకట్టుకు తగ్గించే అవకాశం
● జీడీపీకి కేటాయించిన 3 టీఎంసీల
నీరు చేరికపై అనుమానాలు
● కేసీ రెండో పంటకు నీటి విడుదలపై
స్పష్టత కరువు
● నేడు సాగునీటి సలహా మండలి
సమావేశం
కర్నూలు సిటీ: ఆయకట్టుకు సమృద్ధిగా సాగు నీరు ఇస్తామంటూ ఎన్నికల సమయంలో ఇచ్చిన కూటమి నేతల హామీలు నీటి మూటలుగా మారాయి. రబీలో సాగు చేసే ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీటిని ఇచ్చేందుకు అవకాశం ఉన్నా తాగునీటి అవసరాల పేరుతో ఆయకట్టుకు వాటాను కుదించేందుకు కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. తుంగభద్ర దిగువ కాలువ (ఎల్లెల్సీ) పై 16 మండలాల్లో 194 గ్రామాలు ఆధారపడి ఉన్నాయి. ఖరీఫ్ సీజన్‌లో 43,519 ఎకరాలు, రబీలో 1,07,615 ఎకరాలకు బచావత్ ట్రిబ్యూనల్ ప్రకారం 24 టీఎంసీల నీటిని కేటాయించింది. ఈ కాల్వ చివరి ఆయకట్టుకు నీరు అందించేందుకు 2008లో కాల్వ ఆధునికీకరణకు అప్పటి సీఎం వైఎస్సార్ రూ.179 కోట్లు మంజూరు చేసి 18 ప్యాకేజీలుగా విభజించి పనులు చేపట్టారు. ఆయన మరణం తరువాత వచ్చిన నేతలెవరూ పట్టించుకోకపోవడంతో ప్రతి ఏడాది వాటాలో 7 నుంచి 8 టీఎంసీల నీటిని కోల్పోవాల్సి వస్తుంది. రెండేళ్లలో పూర్తి కావాల్సిన పనులు పదహారేళ్లు అయినా పూర్తికాలేదు. 18 ప్యాకేజీ పనుల్లో 5 ప్యాకేజీల పనులు మాత్రమే పూర్తి చేశారు. 2 ప్యాకేజీల పనులు 2016 సంవత్సరానికి ముందే కాంట్రాక్ట్ క్లోజ్ చేశారు. మిగిలిన 11 ప్యాకేజీల పనులు పెండింగ్‌లో వివిధ దశల్లో ఉన్నాయి. 2017 జూలై 29వ తేదీన పెండింగ్ పనులు చేసే కాంట్రాక్ట్‌లు రద్దు చేశారు. ఏడేళ్ల క్రితమే పనులు పూర్తి చేసి ఉంటే రూ.67 కోట్లు మాత్రమే ఖర్చు అయ్యేవి. కానీ ఇప్పుడు ఆ పనులు చేయాలంటే సుమారు రూ.100 కోట్లకుపైగా ఖర్చు అయ్యే అవకాశం. 2017లో నీరు–చెట్టు పనులపై ఉన్న చిత్తశుద్ధి ఈ ఆధునికీకరణపై దృష్టి పెట్టి ఉంటే చివరి ఆయకట్టుకు సాగు నీరు అందేది. ఇకనైనా కూటమి సర్కారు ఆ పనులపై దృష్టి పెట్టాలి. ఈ ఏడాది రికార్డు స్థాయిలో టీబీ డ్యాంలో నీటి లభ్యత వచ్చింది. ఇటీవల సవరించిన అంచనాల మేరకు 21.7 టీఎంసీల నీటిని కేటాయించగా, ఇప్పటి వరకు సుమారు 8.7 టీఎంసీలు వినియోగించుకోగా, ఇంకా 13 టీఎంసీ నీరు రావాల్సి ఉంది. ఈ నీటితో రబీలో ఆయకట్టు మొత్తానికి నీరు ఇచ్చేందుకు అవకాశం ఉంది. గత రెండున్నర దశాబ్దాలుగా కోడుమూరు, పాణ్యం నియోజకవర్గాల్లోని ఎల్లెల్సీ ఆయకట్టుకు చుక్క నీరు అందడం లేదు. ఎగువన ఉన్న మంత్రాలయం నియోజకవర్గానికి సైతం నీరందని పరిస్థితి. చివరి ఆయకట్టుకు నీరు అందించాలంటే కాలువను ఆధునికీకరించాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment