ఏపీజీబీలో మూడు గ్రామీణ బ్యాంకుల విలీనం! | - | Sakshi
Sakshi News home page

ఏపీజీబీలో మూడు గ్రామీణ బ్యాంకుల విలీనం!

Published Tue, Nov 26 2024 1:50 AM | Last Updated on Tue, Nov 26 2024 1:50 AM

-

కడపలోనే ప్రధాన కార్యాలయం

కొనసాగించాలని ఉద్యోగులు డిమాండ్‌

కర్నూలు(అగ్రికల్చర్‌): రాష్ట్రంలోని వివిధ గ్రామీణ బ్యాంకులు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో విలీనమవుతున్నాయి. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. రాష్ట్రంలో మొత్తం నాలుగు గ్రామీణ బ్యాంకులు ఉండగా.. ఇందులో ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు అతి పెద్ద బ్యాంకుగా ఉంది. మిగతా మూడింటిలో ఆంధ్రప్రగతి గ్రామీణ వికాస్‌ బ్యాంకు, చైతన్య గోదావరి బ్యాంకు, సప్తగిరి గ్రామీణ బ్యాంకులున్నాయి. ఈ మూడు ఏపీజీబీలో విలీనం కానున్నాయి. ఈ నేపథ్యంలో కడపలో ఉన్న ఏపీజీబీ కార్యాలయాన్నే ప్రధాన కార్యాలయంగా గుర్తించాలని ఆ బ్యాంకు అధికారుల సంఘాల నేతలు హరిప్రసన్న కుమార్‌, జగదీశ్వరరెడ్డి, హనుమంతురెడ్డి, డి.మహమ్మద్‌, సురేష్‌, బార్గవ్‌, గజేంద్రరెడ్డి, నాగరాజు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం ఏపీజీబీ బ్యాంకు యూనియన్‌ల ప్రతినిధులు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితను కలసి విలీనమవుతున్న గ్రామీణ బ్యాంకుల ప్రధాన కార్యాలయాన్ని కడపలో కొనసాగించే విధంగా చూడాలని కోరారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement