దీపం.. దివ్యతేజం
శ్రీశైలంటెంపుల్: ఇలకై లాసమైన శ్రీశైలమహాక్షేత్రంలో కార్తీకమాసోత్సవాలు ఆధ్మాత్మికభరితంగా సాగుతున్నాయి. కార్తీకమాసం చివరి సోమవారం కావడంతో శ్రీగిరికి భక్తులు పోటెత్తారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వేలాదిగా తరలివచ్చారు. వేకువజామునే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి, మల్లన్న దర్శనానికి బారులు తీరారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు ఆలయ ద్వారాలను తెరచి దర్శనాలకు అనుమతించారు. కార్తీకమాసం చివరి సోమవారాన్ని పురస్కరించుకుని శ్రీశైల దేవస్థానం లోక కల్యాణం కోసం పుష్కరిణి వద్ద లక్షదీపోత్సవం, పుష్కరిణి హారతి నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని భక్తులు కనులారా తిలకించి స్వామి అమ్మవార్లను దర్శించుకొని పరవశించిపోయారు. ఈ పూజా కార్యక్రమంలో దేవస్థాన అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
మహానందిలో వైభవంగా జల హారతులు
మహానంది: కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా మహానందిలో రాత్రి గంగాజల హారతులు అత్యంత వైభవంగా జరిగాయి. ఆలయ ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వేద పండితులు రవిశంకర్ అవధాని, ఉప ప్రధాన అర్చకులు మూలస్థానం శంకరయ్య శర్మ, ముఖ్య అర్చకులు రాజారత్తయ్య బాబు, రాజమాణిక్య శర్మ, రాఘవ శర్మ ఆధ్వర్యంలో ముందుగా గంగాదేవికి విశేష పూజలు చేసి జలహారతులు ఇచ్చారు. వేలాది మంది భక్తులు తిలకించారు.
Comments
Please login to add a commentAdd a comment