1.14 టీఎంసీలు 24 వేల ఎకరాలకు ఎలా..?
గాజులదిన్నె ప్రాజెక్టు 4.5 టీఎంసీల సామర్థ్యం ఉంది. రబీలో మాత్రమే ఈ ప్రాజెక్టు కింద 24 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. తాగు నీటి అవసరాల కోసం సాగు నీటి ప్రాజెక్టు కాస్తా సమ్మర్ స్టోరేజీ ట్యాంకులాగా మారింది. దీంతో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హంద్రీనీవా కాలువ 110.4 కి.మీ దగ్గర అదనపు స్లూయిజ్ ఏర్పాటు చేసి గాజులదిన్నె ప్రాజెక్టుకు 3 టీఎంసీల నీటిని మళ్లీంచేందుకు నీటి కేటాయింపులు చేసి సామర్థ్యాన్ని సైతం 4.5 టీఎంసీల నుంచి 5.5 టీఎంసీలకు పెంచేందుకు పనులు చేపట్టింది. దీంతో నీటి నిల్వలు పెరగనుండడంతో ఆ మేరకు కొత్త గేట్లను సైతం ఏర్పాటు చేశారు. ఈ ఏడాది హంద్రీనీవా కాల్వకు మూడున్నర నెలలుగా నీరు పంపింగ్ చేస్తున్నా.. జీడీపీకి రెండు రోజుల క్రితం నీటిని 230 క్యూసెక్కులకు గాను 100 క్యూసెక్కులు మాత్రమే ఇచ్చారు. ఇలా అయితే శ్రీశైలంలో నీటి నిల్వలు మరో నెలన్నర రోజులు పడిపోయే అవకాశం ఉండడంతో 3 టీఎంసీల నీరు జీడీపీకి వచ్చే పరిస్థితులు అగుపించడం లేదు. ప్రస్తుతం జీడీపీలో 2.14 టీఎంసీల నీరు ఉంది. ఇందులో 1 టీఎంసీకిపైగా తాగునీటికి పోతే ఇక మిగిలిన 1.14 టీఎంసీలతో 24 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు ఇవ్వడం అసాధ్యం.
నేడు సాగునీటి సలహా మండలి
సమావేశం
జిల్లాలో తుంగభద్ర దిగువ కాలువ, గాజులదిన్నె ప్రాజెక్టు, కేసీ కెనాల్ పరిధిలో ఉన్న కొంత ఆయకట్టుకు రబీలో సాగు నీటిని ఇచ్చేందుకు నేడు (మంగళవారం)సాగు నీటి సలహా మండలి సమావేశం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఎల్లెల్సీ, జీడీపీతో పాటు, సాగు నీటి అంశాలు చర్చించనున్నారు. సమావేశానికి జిల్లాకు చెందిన మంత్రి టీజీ భరత్‌తో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment