ఆర్టీసీ బస్సును ఢీకొని ఇద్దరికి గాయాలు
కోసిగి: మండల కేంద్రం కోసిగిలోని సాయి బాబా గుడి సమీపంలో ఎమ్మిగనూరుకు చెందిన ఆర్టీసీ బస్సును ఢీకొని ఇద్దరు గాయపడ్డారు. శుక్రవారం రాత్రి కోసిగి నుంచి ఉరుకుంద గ్రామానికి బస్సు వెళ్తుంది. దుద్ది గ్రామానికి చెందిన భీమయ్య, తిమ్మప్ప అనే వ్యక్తులు అతిగా మద్యం తాగి బైక్ పై వస్తున్నారు. సాయిబాబా గుడి సమీంపంలో బస్సును ఢీకొని కిందపడిపోయారు. గాయాలు కావడంతో వారిని కోసిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం క్షతగాత్రులను అక్కడి వైద్యులు ఆదోని ప్రభుత్వాసుపత్రికి రెఫర్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment