ఉసూరుమని‘పింఛన్’
● ఈ ఏడాది ఆగస్టు వరకు కొత్త పింఛన్లు లేనట్టే! ● నేడు ఫిబ్రవరి నెల పింఛన్ల పంపిణీ
కర్నూలు(అగ్రికల్చర్)/నంద్యాల(న్యూటౌన్): ఉ మ్మడి కర్నూలు జిల్లాలో కొత్తపింఛన్ల కోసం వృదు ్ధ లు, వితంతువులు, దివ్యాంగులు, చేనేతకార్మికులు, మత్స్యకారులు ఎదురు చూస్తున్నారు. అయితే రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కొత్త పింఛన్లు ఇవ్వడంపై ఎలాంటి ఆసక్తి చూపడం లేదు. పింఛన్ల వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయి అనర్హత పేరుతో తొలగింపుల పర్వం పూర్తి అయ్యే వరకు కొత్త పింఛన్లకు అవకాశం లేదు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఏడాదికి రెండుసార్లు కొత్త పింఛన్లు ఇచ్చేవారు. అర్హత కలిగిన వారందరికీ రాజకీయాలకు అతీతంగా పింఛన్లు మంజూరయ్యేవి. కూటమి ప్రభుత్వం కొత్త పింఛన్లు ఇవ్వకుండా ఉసూరుమనిపిస్తోంది. వృద్ధాప్య పింఛన్ తీసుకుంటున్న పలువురు 2024 జనవరిలో మృతిచెందారు. లబ్ధిదారు భార్యకు మరుసటి నెలలోనే వితంతు పింఛన్ ఇవ్వకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోంది. దీంతో ఉమ్మడి కర్నూలు జిల్లాలో వేలాది మంది వితంతు మహిళలు పింఛన్లకు దూరం అయ్యారు.
ఇదీ దుస్థితి..
● నెలల క్రితమే భర్తలు మృతి చెందినా నంద్యాల మండలంలోని అయ్యలూరు గ్రామంలో లక్ష్మి, అప్పయ్యమ్మ, రమణమ్మలకు వితంతు పింఛన్ రాలేదు.
● పోలూరు, మిట్నాల, పెద్దకొట్టాల తదితర గ్రామాల్లో వృద్ధులు, వితంతువులకు నేటికీ పింఛనకు నోచుకోలేదు. అర్హత ఉన్న దివ్యాంగులు, వృద్ధులు కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు. మండల పరిషత్ కార్యాలయాల చుట్టూ వందలాది మంది ప్రదక్షిణలు చేస్తున్నారు.
● పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి సచివాలయాలకు అర్హులు వెళ్తున్నా వెబ్‌సైట్ ఓపెన్ కాలేదని చెప్పి వెనక్కి పంపిస్తున్నారు.
రచ్చబండల వద్ద పింఛన్ల పంపిణీ?
ఇంటి దగ్గర పింఛన్ల పంపిణీ అంటూ కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చెప్పిన మాటలు అమలు కావడం లేదు. ప్రతి నెలా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటి దగ్గరే పింఛన్లు పంపిణీ చేస్తున్నట్లు పేర్కొంటున్నా.. అది నోటిమాటలకే పరిమితం అవుతోంది. గత ఏడాది జూన్ నుంచి 2025 జనవరి నెల వరకు ఒక్క సచివాలయం పరిధిలో కూడా 100 శాతం పింఛన్లు ఇంటి దగ్గరే పంపిణీ చేయలేదు. రచ్చబండలు, సచివాలయాల్లో పంపిణీ చేశారు. ఫిబ్రవరి నెలకు సంబంధించి ఉమ్మడి జిల్లాలో 4,54,924 మంది పింఛన్ లబ్ధిదారులకు రూ.194 కోట్లు మంజూరు అయ్యాయి. కర్నూలు జిల్లాలో 2,39,332, నంద్యాల జిల్లాలో 2,15,592 మంది లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీకి నిధులు విడుదల అయ్యాయి. ఫిబ్రవరి నెలలో కూడా ఇంటి దగ్గరే పంపిణీ అనేది నామమాత్రానికే పరిమితం కానుంది.
పింఛన్ల తొలగింపు కుట్ర !
ఉమ్మడి కర్నూలు జిల్లాలో 56,518 మంది దివ్యాంగులకు పింఛన్ వస్తోంది. ప్రతి పింఛన్‌ను రీ వెరిఫికేషన్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వారంలో మంగళ, బుధ, గురువారాల్లో పింఛన్లను వెరిఫికేషన్ చేపట్టింది. ఫిబ్రవరి నెలలో కూడా వారంలో మూడు రోజుల పాటు పింఛన్ వె రిఫికేషన్ కోసం అధికారులు ప్రణాళికలు రూపొందించారు. దివ్యాంగులకు కర్నూలు, ఆదోని, నంద్యాలలో పరీక్షలు నిర్వహిస్తారు. అనంతరం వితంతు, ఒంటరి మహిళలు, వృద్ధాప్య పింఛన్లులు కూడ పరిశీలించే కార్యక్రమం చేపడుతారు. ఈ నేపథ్యంలో పాత పింఛన్లను తొలగించే కుట్ర చేస్తున్నారా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. తొలగింపుల తర్వాతనే కొత్త పింఛన్లకు అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment