వైద్యుల కొరత! | Sakshi
Sakshi News home page

వైద్యుల కొరత!

Published Tue, May 7 2024 6:45 AM

వైద్య

పెరుగుతున్న ఓపీ..

పీహెచ్‌సీలో ఓపీ కోసం రోజురోజుకూ రోగుల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం ప్రతిరోజు 80 నుంచి 100 మంది వరకు పలు రకాల అరోగ్య సమస్యలతో ఆస్పత్రికి వస్తున్నారు. వైద్యురాలితో పాటు మరో పల్లెదవాఖాన వైద్యుడు, ఆర్‌బీఎస్‌కే వైద్యులు విధులు నిర్వర్తిస్తున్నారు. కాగా మండలంలో 13 ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిరాలు(పల్లె దవాఖానలు) ఉండగా ము

ల్కలపల్లి, వెన్నారంలో ఎంబీబీఎస్‌ వైద్యులు, డోర్నకల్‌–2, గొల్లచర్లలో బీఏఎంఎస్‌ వైద్యులు విధులు నిర్వర్తిస్తున్నారు. మిగిలిన గ్రామాల్లో స్టాఫ్‌ నర్సులు(బీఎస్సీ నర్సింగ్‌) వైద్య సేవలు అందిస్తున్నారు.

డోర్నకల్‌: డోర్నకల్‌ పీహెచ్‌సీలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. వైద్యుల కొరతతో పాటు వసతులు, సిబ్బంది కేటాయింపులో ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా నలుగురు వైద్యులను కేటాయించగా రెండేళ్ల నుంచి ఒకే వైద్యురాలు విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమె అందుబాటులో లేని సమయంలో పల్లెదవాఖాన వైద్యులు ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక్కడ విధులు నిర్వహించాల్సిన వైద్యురాలు ఉన్నత వైద్య విద్య కోసం సెలవుపై వెళ్లగా పోస్టు ఖాళీగా ఉంది. అలాగే రెండేళ్ల క్రితం దంత వైద్యుడు బదిలీ కాగా ఇప్పటి వరకు మరో వైద్యుడిని కేటాయించకపోవడంతో డెంటల్‌ లాబ్‌ నిరుపయోగంగా మారింది.

ఆస్పత్రి బయట కార్యక్రమాలే ఎక్కువ..

గ్రామాల్లో వైద్య శిబిరాలు, పల్స్‌ పోలియో, ఎన్‌సీడీ శిబిరాలు, డెంగీ, మలేరియా, విషజ్వరాల శిబిరాలు నిర్వహిస్తుండటంతో వైద్యురాలు తరుచూ అందుబాటులో ఉండటం లేదు. వీటితో పాటు జిల్లా కేంద్రాల్లో సమావేశాలు, శిక్షణ శిబిరాలు, రివ్యూ మీటింగులకు వైద్యురాలు హాజరవుతున్నారు. కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్యే పీహెచ్‌సీ పరిస్థితిని సమీక్షించి వైద్య పోస్టులను భర్తీ చేయిస్తానని ఇచ్చిన హామీ అమలుకు నోచుకోవడం లేదు. అధికారులు స్పందించి పీహెచ్‌సీలో వైద్యుల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుని రోగులకు నిత్యం మెరుగైన సేవలు అందించాలని స్థానికులు కోరుతున్నారు.

డోర్నకల్‌ పీహెచ్‌సీలో సరిపడాలేని డాక్టర్లు

వసతుల కల్పనలో నిర్లక్ష్యం

రోగులకు అందని మెరుగైన వైద్యం

పట్టించుకోని ఉన్నతాధికారులు

వైద్యుల కొరత!
1/2

వైద్యుల కొరత!

వైద్యుల కొరత!
2/2

వైద్యుల కొరత!

Advertisement
 
Advertisement
 
Advertisement