ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి | Sakshi
Sakshi News home page

ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి

Published Wed, May 8 2024 7:40 AM

ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి

గూడూరు: వైద్యులు, సిబ్బంది ఆస్పత్రికి అందుబాటులో ఉంటూ గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డీఎంహెచ్‌ఓ కళావతిబాయి అన్నారు. మండలంలోని అయోధ్యపురం పీహెచ్‌సీని మంగళవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో జరిగిన ప్రసవాల గూర్చి డాక్టర్‌ యమునను అడిగి తెలుసుకున్నారు. ఆశలు, ఏఎన్‌ఎంలు సూపర్‌వైజర్లు సాధారణ ప్రసవాలపై అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో ప్రోగ్రా మ్‌ ఆఫీసర్‌ బిందుశ్రీ, డీపీహెచ్‌ఎన్‌ మంగమ్మ, సిబ్బంది కోమల, లోక్యానాయక్‌ పాల్గొన్నారు.

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు

గార్ల: వైద్యులు, వైద్యసిబ్బంది విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ అంబరీషా అన్నారు. మంగళవారం మండలంలోని ముల్కనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన తనిఖీ చేసిన అనంతరం వైద్యులు, వైద్యసిబ్బందితో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాలను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని సూచించారు. ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు సబ్‌సెంటర్ల పరిధిలోని గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి వైద్యసేవలు అందించాలని ఆదేశించారు. గర్భిణును గుర్తించి నార్మల్‌ డెలివరీల వలన కలిగే ఉపయోగాల గురించి వివరించాలని పేర్కొన్నారు. ఆయన వెంట డాక్టర్‌ పృథ్వీ, సీహెచ్‌ఓ కృష్ణార్జున్‌రావు, ఎస్‌యూఓ శ్రీనివాస్‌, సీహెచ్‌ఓ సక్కుబాయి, హెచ్‌ఈఓ శ్రీహరి, హెల్త్‌ సూపర్‌వైజర్లు, ఏఎన్‌ఎంలు సిబ్బంది పాల్గొన్నారు.

డీఎంహెచ్‌ఓ కళావతిబాయి

Advertisement
 
Advertisement
 
Advertisement