అనుమానాస్పదస్థితిలో అంగన్వాడీ టీచర్ మృతి
ఎస్‌ఎస్‌తాడ్వాయి : అనుమానాస్పద స్థితిలో అంగన్వాడీ టీచర్ మృతి చెందింది. ఈ ఘటన మండలంలోని గంగారం– తాడ్వాయి మార్గంలోని నీళ్ల వాగు అటవీ ప్రాంతంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఏ టూరునాగారం మండలం చిన్నబోయినపల్లికి చెందిన రడం సుజాత (50) తాడ్వాయి మండలం కా టాపూర్లోని మూడో అంగన్వాడీ కేంద్రంలో టీచర్‌గా పని చేస్తోంది. రోజూ చిన్నబోయినపల్లి నుంచి కా టాపూర్కు రాకపోకలు సాగిస్తుంది. ఈనెల 14న అంగన్వాడీ కేంద్రం నుంచి మధ్యాహ్నం ఇంటికి బయలుదేరింది. సాయంత్రమైనా రాకపోవడంతో కుటుంబీకులు.. సుజాత కోసం ఆరా తీశారు. ఈ క్రమంలో బుధవారం నీళ్ల వాగు అటవీ ప్రాంతంలో తునికాకు సేకరణకు వెళ్లిన కూలీలకు సుజాత మృతదేహం కనిపించింది. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. దుండగులు.. సుజాతకు మెడకు స్కార్ఫ్ బిగించి హత్య చేశారని పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థ లిని పస్రా సీఐ శంకర్, తా డ్వాయి ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. సుజాత.. 25 సంవత్సరాల క్రితం భర్తతో విడాకులు తీసుకుంది. ఈ ఘటనపై మృతురాలి కుమారుడు రడం చరణ్ ఫిర్యాదు మేరకు కేసు న మోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. కాగా, సుజాత మృతి చెందిన విషయం తెలియడంతో కాటాపూర్, గంగారం గ్రామాల నుంచి ప్రజలు ఘటనాస్థలికి భారీగా తరలివచ్చారు. సుజాత మృతదేహాన్ని చూసి కంటతడిపెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment