సమన్వయంతో క్రీడా ఎంపికలు విజయవంతం
వరంగల్ స్పోర్ట్స్: జిల్లా క్రీడా ప్రాధికారిత సంస్థ కోచ్‌లు, డీఎస్‌ఏ సిబ్బంది, క్రీడా సంఘాల బాధ్యుల సమన్వయంతోనే నాలుగు రోజుల పాటు సాగిన క్రీడా ఎంపిక పోటీలు విజయవంతంగా ముగిశాయని హనుమకొండ జిల్లా యువజన, క్రీడల అధికారి గుగులోత్ అశోక్‌కుమార్ అన్నారు. హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న పాఠశాల క్రీడల సమాఖ్య అండర్–19 ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి క్రీడా ఎంపిక పోటీలు మంగళవారం ముగిశాయి. ఈ ముగింపు కార్యక్రమానికి డీవైఎస్‌ఓ అశోక్‌కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నాలుగు రోజులు 41 క్రీడాంశాలలో నిర్వహించిన ఎంపిక పోటీల్లోఉమ్మడి జిల్లా నుంచి 3వేల పై చిలుకు క్రీడాకారులు పాల్గొన్నారని తెలిపారు. కోచ్‌ల సహకారంతో పోటీలను పారదర్శకంగా నిర్వహించి ప్రతిభ గల క్రీడాకారులను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేశామన్నారు. ఈ సందర్భంగా డీఎస్‌ఏ కోచ్‌లు, ఫిజికల్ డైరెక్టర్లు, పీఈటీలు అశోక్‌కుమార్‌ను సన్మానించారు. కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్లు బరుపాటి గోపి, శ్రీనివాస్‌రెడ్డి, శీలం పార్థసారధి, ఫెన్సింగ్ సంఘం జిల్లా కార్యదర్శి దుబ్బ రాము, డీఎస్‌ఏ కోచ్‌లు నరేందర్, కందికొండ రాజు, ఓనపాకల శంకర్, బొడ్డు విష్ణువర్ధన్, దేవిక తదితరులు పాల్గొన్నారు.
డీవైఎస్‌ఓ గుగులోత్ అశోక్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment