ఉత్సాహంగా ఎస్‌జీఎఫ్ ఎంపికలు
వరంగల్ స్పోర్ట్స్: పాఠశాల క్రీడల సమాఖ్య అండర్–14,17 బాలబాలికల ఉమ్మడి వరంగల్ జిల్లా స్థా యి స్విమ్మింగ్, హనుమకొండ జిల్లా స్థాయి కబడ్డీ ఎంపిక పోటీలు మంగళవారం ఉత్సాహంగా జరిగా యి. హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో కబడ్డీ ఎంపికలు నిర్వహించగా, బాలసముద్రంలోని డీఎస్‌ఏ స్విమ్మింగ్ పూల్‌లో ఈత పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి దస్రూ నాయక్ మాట్లాడుతూ స్విమ్మింగ్ పోటీలకు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి 80 మంది బాలబాలికలు హాజరయ్యారని తెలిపారు. ఇందులో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు నవంబర్ 2,3,4 తేదీల్లో హైదరాబాద్ బాచుపల్లిలోని జియాన్ స్పోర్ట్స్ అకాడమీలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. అలాగే, కబడ్డీ ఎంపిక పోటీలకు జిల్లాలోని 14 మండలాల నుంచి 28 టీమ్‌లు హాజరైనట్లు వివరించారు. ఇందులో ప్రతిభ కనబరిచిన జట్లకు నేడు (30వ తేదీ) ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన పోటీలు నిర్వహించనున్నట్లు చెప్పారు. అందులో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఉమ్మడి జిల్లా జట్టుకు ఎంపిక చేసి రాష్ట్ర స్థాయి పంపనున్నట్లు తెలిపారు. నవంబర్ 3వ తేదీన మహబూబ్‌నగర్‌లో జరిగే రాష్ట్ర స్థాయి ఎస్‌జీఎఫ్ అండర్–17 పోటీల్లో పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో స్విమ్మింగ్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి మంచాల స్వామిచరణ్, డీఎస్‌ఏ కోచ్‌లు రాయబారపు నవీన్‌కుమార్, కొత్త ప్రశాంత్, ఓనపాకల శంకర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment