గురువారం శ్రీ 10 శ్రీ అక్టోబర్ శ్రీ 2024
– 10లోu
సాక్షి, మహబూబాబాద్: తెలంగాణలో ప్రత్యేకమైన బతుకమ్మ పండుగ ఖండాంతరాలు దాటి ఖ్యాతిని గడించింది. ఇంతటి ప్రత్యేకత ఉన్నబతుకమ్మ పండుగను తొమ్మిదిరోజులు జరుపుకుంటే.. సరిహద్దులు దాటి తెలంగాణలో స్థిరపడిన రాజస్థాన్ మహిళలు దుర్గామాతను ప్రతిష్టించి సంబురాలు చేసుకుంటున్నారు. దీంతో ఒక వైపు బతుకమ్మ వేడుకలు.. మరోవైపు దాండియా నృత్యాలతో సందడి వాతావరణం నెలకొంది.
సరిహద్దులు దాటి..
వందల సంత్సరాల క్రితం తెలంగాణకు వచ్చి స్థిరపడిన రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర ప్రజలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలతో వారి సంస్కృతిని మేళవింపు చేసి ఉత్సవాలు చేసుకోవడం అనవాయితీగా మారింది. జిల్లాలోని మహబూబాబాద్, డోర్నకల్, గార్ల, తొర్రూరు, కేసముద్రం, మరిపెడ ఇలా ప్రతీ మండల కేంద్రంలో రాజస్థాన్ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన స్థిరపడిన వారు ఉన్నారు. స్వీట్లు, బంగారం, వస్త్ర దుకా ణాలు, ప్లాస్టిక్, గాజులు, ఫ్యాన్సీ ఇలా రకరకాల వ్యాపారాలు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 300పైగా కుటుంబాలు ఉన్నా.. ఎక్కువ కుటుంబాలు ఉన్న మహబూబాబాద్, డోర్నకల్ పట్టణాల్లో ప్రత్యేక అలంకరణల మధ్య దుర్గామాతను ప్రతిష్టించి అమ్మవారి సన్నిధిలో దాండియా ఆడుతున్నారు.
నెలరోజుల ముందు నుంచే..
ఆడ, మగ, చిన్న, పెద్ద తేడా లేకుండా ఆడే ఆట దాండియా. దుర్గామాత ఉత్సవాల్లో ప్రత్యేకంగా ఆడే ఆట. అయితే ఈ ఆట ఆడేందుకు నెల రోజుల ముందు నుంచే సిద్ధం అవుతారు. ఆడవారు గాగ్రా, మగవారు కుడ్తా దుస్తులు ప్రత్యేకంగా తయారు చేయించుకుంటారు. ఆకర్షణగా ఉండే విధంగా అద్దాలు, మెరుపులతో మగ్గం వర్క్ చేయించుకుంటారు. అమ్మవారిని ప్రతిష్టించి ఉత్సాహంగా దాండియా ఆడుతారు.
న్యూస్‌రీల్
అంతా సందడి
తెలంగాణ ప్రజలు బతుకమ్మ పండుగ సందర్భంగా పూలను పూజిస్తూ కోలాటం, ఉయ్యాల పాటలతో ఉత్సాహంగా తొమ్మిదిరోజులు గడుపుతారు. అదేవిధంగా రాజస్తానీయులు దాండియా నృత్యాలతో సందడి చేస్తారు. అయితే బతుకమ్మ పండుగకు రాజస్తానీ, గుజరాతీ, మరాఠీలు వెళ్తారు. వారు పూజంచే దుర్గామాత వద్దకు ఇక్కడి ప్రజలు వెళ్లి సంబురాలు జరుపుకుంంటూ భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిచెబుతారు.
ఒక వైపు బతుకమ్మ, మరోవైపు దాండియా నృత్యం
సరిహద్దులు దాటినా
మరువని సంప్రదాయం
నెలరోజుల నుంచి రాజస్థాన్
మహిళల సమాయత్తం
అమ్మవారికి పూజలు చేస్తూ నృత్యాలు
Comments
Please login to add a commentAdd a comment