కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి
గార్ల: కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించి, త్వరితగతిన ధాన్యం సేకరించాలని అడిషనల్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో ఆదేశించారు. మంగళవారం మండల పరిధిలోని సత్యనారాయణపురం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. మండలంలో ఇప్పటి వరకు ఒకటే కేంద్రం ప్రారంభించడమేమిటని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని సిబ్బందిని ఆదేశించారు. రైతులు దళారులకు ధాన్యం అమ్మి నష్టపోవద్దని సూచించారు. అనంతరం చిన్నకిష్టాపురం గ్రామంలో సమగ్ర కుటుంబ సర్వే తీరుతెన్నులను పరిశీలించారు. సర్వేను వేగవంతం చేసి గడువులోగా పూర్తి చేయాలన్నారు. ఎంపీడీఓ మంగమ్మ, డీటీ జర్పుల సుధాకర్, ఆర్ఐలు రామకృష్ణ, స్వప్న పాల్గొన్నారు.
సదుపాయాలు కల్పించాలి
బయ్యారం: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సదుపాయాలు కల్పించాలని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పొ సూచించారు. మండలంలోని బయ్యారం, కొత్తపేటలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం ఆయన పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment