నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు
● కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్
మహబూబాబాద్: రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని, ప్రధానంగా కేంద్రాల నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ హెచ్చరించారు. కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మంగళవారం ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణపై సంబంధిత అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సన్న, దొడ్డు రకం ధాన్యానికి వేర్వేరుగా కేంద్రాలు ఏర్పాటు చేసి, మౌలిక వసతులు కల్పించాలన్నారు. ధాన్యం విషయంలో వ్యవసాయ అధికారులు రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. కేంద్రాల్లో సరిపడా గన్నీబ్యాగులు, టార్పాలిన్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఆన్‌లైన్ విధానం ద్వారా వివరాలు నమోదు చేయాలన్నారు. అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, డీసీఓ వెంకటేశ్వర్లు, డీసీఎస్‌ఓ ప్రేమ్‌కుమార్, సివిల్ సప్లయీస్ డీఎం కృష్ణవేణి, డీఏఓ విజయనిర్మల పాల్గొన్నారు.
న్యాయం వైపు యంత్రాంగం..
ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమం కోసం అన్ని ప్రభుత్వ విభాగాలు పని చేస్తాయని, ప్రధానంగా వారికి న్యాయం చేకూర్చేలా జిల్లా యంత్రాంగం పని చేస్తుందని కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని మినీ సమావేశ మందిరంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ నర్మద అధ్యక్షతన జిల్లాస్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 46 ఎస్సీ, ఎస్టీ కేసులకు ప్రభుత్వం తరఫున రూ.11,70,000 పరిహారం అందించడం జరిగిందన్నారు. ఎస్పీ సుధీర్‌రాంనాథ్ కేకన్ మాట్లాడుతూ.. జిల్లాలో ఎస్సీ, ఎస్టీలకు పోలీసులు అండగా ఉంటారని చెప్పారు. గ్రామాల్లో వారిపై దాడులు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. నర్మద మాట్లాడుతూ.. బుధవారం ఎస్సీ, ఎస్టీ కమిటీ సభ్యులు జిల్లాకు వస్తున్నారన్నారు. ఏఎస్పీ చెన్నయ్య, ఆర్డీఓలు గణేష్, కృష్ణవేణి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment