మెరుగైన సేవలే లక్ష్యం!
నెహ్రూసెంటర్: రైతులు, ప్రజలకు మెరుగైన విద్యుత్ సేవలు అందించేందుకు ట్రాన్స్‌ఫార్మర్లపై టోల్‌ఫ్రీ నంబర్ ముద్రిస్తున్నారు. విద్యుత్ సరఫరాలో ఎలాంటి సమస్యలు తలెత్తినా.. రైతులు వెంటనే ట్రాన్స్‌ఫ్మార్మర్‌పై ఉన్న టోల్‌ఫ్రీ నంబర్‌కు సమాచారం అందిస్తే వెంటనే స్పందించి టోల్‌ఫ్రీ నంబర్‌కు సమాచారం అందిస్తే వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటామని విద్యుత్‌శాఖ అధికారులు తెలుపుతున్నారు.
విస్తృత ప్రచారం..
రైతులు, ప్రజలకు 1912 టోల్‌ఫ్రీ నంబర్ 24 గంటలు అందుబాటులో ఉంటుందని, కార్పొరేట్ కార్యాలయం నుంచి టోల్ ఫ్రీ నంబర్ సేవలు అందుతాయని అధికారులు చెబుతున్నారు. ప్రతీఒక్క వినియోగదారుడు గుర్తుపెట్టుకునేలా టోల్‌ఫ్రీ నంబర్ 1912 ను విస్తృతంగా ప్రచారం చేపడుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
రైతులకు అవగాహన..
విద్యుత్‌శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పొలంబాట కార్యక్రమంలో భాగంగా విద్యుత్ ప్రమాదాలు, జాగ్రత్తలు తీసుకోవడంపై రైతులకు వివరిస్తున్నారు. రైతులు విద్యుత్ సమస్యలు తలెత్తినప్పుడు సొంతగా విద్యుత్ సంబంధిత పనులు చేపట్టొద్దని అవగాహన కల్పిస్తున్నారు. దీంతో పాటు టోల్‌ఫ్రీం నంబర్ 1912పై విస్తృత ప్రచారం చేస్తున్నారు. విద్యుత్ సమస్యలుంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని, వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలుపుతున్నారు.
విద్యుత్ అధికారులకు సమాచారం ఇవ్వాలి
విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం ఏర్పడిన వెంటనే ట్రాన్స్‌ఫార్మర్‌పై ఉన్న టోల్ ఫ్రీ నంబర్ 1912కు సమాచారం అందించాలి. దీంతో పాటు విద్యుత్ అధికారులకు సమాచారం అందిస్తే వెంటనే సమస్యను పరిష్కరిస్తాం. విద్యుత్ వినియోగదారులు, రైతులు విద్యుత్ ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు వహించాలి.
– పి.విజయ్, విద్యుత్‌శాఖ డీఈ
ట్రాన్స్‌ఫార్మర్లపై 1912 టోల్‌ఫ్రీ నంబర్ ముద్రణ
పొలంబాటలో రైతులకు విద్యుత్‌శాఖ అధికారుల అవగాహన
Comments
Please login to add a commentAdd a comment