మానుకోటలో ఉత్కంఠ
సాక్షి, మహబూబాబాద్: రాజకీయ గొడవలు, ఘర్షణలకు నిలయమైన మానుకోటలో మరోసారి ఉ త్కంఠ నెలకొంది. లగచర్ల గిరిజన రైతులకు మద్దతుగా జిల్లాలో బీఆర్‌ఎస్ తలపెట్టిన ధర్నాకు కేటీఆర్‌ను ఆహ్వానించడంపై కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మానుకోట తహసీల్ ఎ దుట గురువారం నిర్వహించే ధర్నాకు ప్రజలు వేలాదిగా తరలివచ్చి లగచర్ల గిరిజనులకు మద్దతు తెలపాలని బీఆర్‌ఎస్ నాయకులు పిలుపునివ్వగా.. గతంలో గిరిజనులకు అన్యాయం జరిగినప్పుడు రా ని కేటీఆర్ ఇప్పుడెందుకు వస్తున్నారు?ఆయనను అడ్డుకోండి అని కాంగ్రెస్ నాయకులు పిలుపునిచ్చా రు. ఇలా ఒకరు ధర్నా నిర్వహిస్తామని ప్రకటించ డం.. మరొకరు కేటీఆర్‌ను అడ్డుకుంటామని హెచ్చరించిన నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది.
పోటాపోటీగా విలేకరుల సమావేశాలు..
పోలీసులు అరెస్టు చేసిన లగచర్ల గిరిజనులకు మద్దతుగా బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా ను విజయవంతం చేయాలని పిలుపునిస్తూ ఆ పార్టీ నాయకులు బుధవారం జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. మానుకోట జిల్లా గిరిజనుల మద్దతు తెలిపేందుకు ధర్నా నిర్వహిస్తున్నామని, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతారని ఎమ్మెల్సీలు తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ ప్రకటించారు. ఇదిలా ఉండగా కేటీఆర్ రాకను తప్పుపడుతూ.. ఆయనను జిల్లాలో అడుగుపెట్టనివ్వబోమని, అడుగడుగునా అడ్డుకుంటామని కాంగ్రెస్ పార్టీ నాయకులు విలేకరుల సమావేశంలో హెచ్చరించారు. ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యేలు రాంచంద్రునాయక్, మురళీనాయక్ మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో మానుకోట గిరిజనులపై జరిగిన దాడులు కేటీఆర్‌కు కనిపించలేదా.. అప్పుడెందుకు రాలేదని ప్రశ్నించారు.
అనుమతి కోసం నిరీక్షణ..
కేటీఆర్ పాల్గొనే మహాధర్నాకు జిల్లా పోలీసులు బుధవారం రాత్రి వరకు అనుమతి ఇవ్వలేదు. ముందుగా మానుకోట టౌన్ పోలీస్‌స్టేషన్‌లో బీఆర్‌ఎస్ నాయకులు దరఖాస్తు చేసుకున్నారు. ఆ తర్వాత ఎస్పీని కలిసి అనుమతి కోరేందుకు రాజ్య సభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, సత్యవతి రాథోడ్, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు వెళ్లారు. అయితే రాత్రి వరకు అనుమతి ఇవ్వకపోవడంతో ఎస్పీ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు.
లగచర్ల గిరిజనులకు మద్దతుగా నేడు బీఆర్‌ఎస్ ధర్నా
కేటీఆర్ రాకపై కాంగ్రెస్ ఆగ్రహం
అడ్డుకుంటామని ఎంపీ,
ఎమ్మెల్యేల హెచ్చరిక
అర్ధరాత్రి వరకు ధర్నాకు
అనుమతి ఇవ్వని పోలీసులు
లగచర్ల బాధితులకు న్యాయం జరగాలి
నేటి కేటీఆర్ ధర్నాను
విజయవంతం చేయాలి
ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్
కేటీఆర్ ధర్నాను
అడ్డుకుంటాం..
విప్ రాంచంద్రునాయక్, ఎంపీ బలరాంనాయక్, ఎమ్మెల్యే మురళీనాయక్
– వివరాలు
8లోu
Comments
Please login to add a commentAdd a comment