మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలి
మహబూబాబాద్ అర్బన్: నల్లగొండ–వరంగల్– ఖమ్మం నియోజకవర్గ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి తనను గెలిపించాలని పీఆర్‌టీయూ అభ్యర్థి పింగిళి శ్రీపాల్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని పలు వార్డుల్లో సోమవారం రాత్రి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా శ్రీపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికలో తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలన్నారు. ఐదు డీఏ బాకాయిలను ఇప్పించే బాధ్యత తమదని, సీపీఎస్ రద్దు, 317జీవోపై సుదీర్ఘ పో రాటం చేయడంతో నేడు బదిలీలు కొనసాగుతున్నాయన్నారు. పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు సంకా బద్రినారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి మిర్యాల సతీష్‌రెడ్డి, నాయకులు కళ్లెం వెంకట్‌రెడ్డి, గీత, హ ల్యానాయక్, రామోజీనాయక్, సుజాత, కీర్తనరెడ్డి, చిట్టిబాబు, భవాని, సరిత, నాగరాజు పాల్గొన్నారు.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పీఆర్‌టీయూ
అభ్యర్థి పింగిళి శ్రీపాల్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment