ఆటోను ఢీకొన్న ఆర్టీసీ బస్సు..
లింగాలఘణపురం: ఓ ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్‌తో సహా అందులో ఉన్న నలు గురు విద్యార్థులకు గాయాలయ్యాయి. ఈ ఘటన మంగళవారం మండలంలోని నెల్లుట్ల ఆర్టీసీ కాలనీ సమీపంలో జరిగింది. ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. లింగాలఘణపురానికి చెందిన ఆటో జనగామ నుంచి పదో తరగతి విద్యార్థులను తీసుకుని వస్తోంది. ఈ క్రమంలో ఆర్టీసీ కాలనీ సమీపంలో ఆగి ఉన్న కారును బైక్ వెనుక నుంచి ఢీకొంది. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరుగుతోంది. ఈ క్రమంలో తొర్రూరు నుంచి జనగామ వస్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ వాగ్వాదం చూస్తూ ఎదురుగా వస్తున్న ఆటోను గమనించకుండా ఢీకొన్నాడు. దీంతో ఆటో డ్రైవర్ బోయిని రాంబాబు కు తీవ్ర గాయాలయ్యాయి. గుమ్మడవెల్లికి చెందిన పదో తరగతి విద్యార్థిని గువ్వల అర్చనకు కాలు విరిగి అపస్మారక స్థితికి చేరుకుంది. లింగాలఘణపురానికి చెందిన ఎడ్ల శశాంక్, బెజ్జం శివప్రసాద్, కేమిడి లిఖితకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే 108లో జనగామ ఏరి యా ఆస్పత్రికి తరలించారు. ఎస్సై శ్రావణ్‌కుమార్ ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఆస్పత్రిలో క్షతగ్రాతులతో మాట్లాడి ప్రమాద తీరును తెలుసుకున్నారు.
డ్రైవర్ సహా నలుగురు విద్యార్థులకు గాయాలు
నెల్లుట్ల ఆర్టీసీ కాలనీ సమీపంలో ఘటన
Comments
Please login to add a commentAdd a comment