రోడ్డు ప్రమాదంలో పంచాయతీ కార్యదర్శి మృతి
రేగొండ: రోడ్డు ప్రమాదంలో పంచాయతీ కార్యదర్శి మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని తిరుమలగిరికి చెందిన గంగుల చంద్రారెడ్డి (56) మండలంలోని నారాయణపురంలో పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ క్రమంలో బైక్‌పై మండల కేంద్రం నుంచి తిరుమలగిరికి వెళ్తుండగా ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని 108లో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
జంగాలపల్లిలో మహిళ..
వాజేడు: రోడ్డు ప్రమాదంలో గాయపడిన మండలంలోని జంగాలపల్లికి చెందిన వాసం నాగలక్ష్మి(42) చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి కుమారుడు నవీన్ కథనం ప్రకారం.. బైక్‌పై దంపతులు వాసం నీలాద్రి, నాగలక్ష్మి ఆదివారం ఛత్తీస్‌గఢ్ వెళ్లి వస్తున్నారు. ఈ క్రమంలో పెద్ద గొళ్లగూడెం, చీకుపల్లి గ్రామాల మధ్య ఇసుక వాగు సమీపంలో నాగలక్ష్మి బైక్ పై నుంచి జారి పడింది. ఈ ప్రమాదంలో స్పృహ కోల్పోవడంతో వెంటనే వరంగల్ తరలించారు. పరీక్షలు చేసిన వైద్యులు తలలో రక్తం గడ్డ కట్టిందని తెలిపి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు రెఫర్ చేశారు. దీంతో కుటుంబీకులు నాగలక్ష్మిని సోమవారం రాత్రి హైదరాబాద్ తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది.
Comments
Please login to add a commentAdd a comment