ఆండ్రోగ్రాఫిస్ థెనియెన్సిస్ మొక్క
వీపనగండ్ల: వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం కల్వరాళ్ల గ్రామానికి చెందిన విద్యార్థి భరతసింహయాదవ్ ఆండ్రోగ్రాఫిస్ థెనియెన్సిస్ అనే కొత్త మొక్కను కనుగొన్నారు. భరత్ తమిళనాడులోని ది మధుర కాలేజ్‌లో ప్రొఫెసర్ కురుప్‌స్వామి ఆధ్వర్యంలో వృక్షశాస్త్రంలో పీహెచ్‌డీ చేస్తున్నారు. ఆండ్రోగ్రాఫిక్ జాతికి చెందిన ఈ మొక్కలు జలుబు, దగ్గు, జ్వరం, కామెర్లు, విరేచనాలు తదితర వ్యాధుల చికిత్సలో ఎంతో ఉపయోగపడతాయి. ప్రస్తుతం ఈ మొక్క అంతరించిపోయే దశలో ఉందని విద్యార్థి భరతసింహ పేర్కొన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మారుమూల ప్రాంతానికి చెందిన భరత్ సొంత గ్రామంలో ప్రాథమిక విద్య పూర్తి చేసి ఇంటర్, డిగ్రీ వనపర్తిలో చదువుకున్నాడు. పశ్చిమ కనుమల్లో అంతరించి పోతున్న మొక్కల జీవిత చక్రం అనే అంశంపై పరిశోధనలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment