ఎఫ్‌డీసీ సర్వే ప్రారంభం
జడ్చర్ల టౌన్/హన్వాడ/భూత్పూర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యామిలీ డిజిటల్ కార్డు (ఎఫ్‌డీసీ) సర్వే గురువారం ప్రారంభమైంది. పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికై న హన్వాడ మండలం మాదారం, మహబూబ్‌నగర్ మున్సిపాలిటీలో 37వ వార్డు, జడ్చర్ల మండలం ఆల్వాన్‌పల్లి, జడ్చర్ల పురపాలికలో 24వ వార్డు, చిన్నచింతకుంట మండలం సీతారాంపేట, భూత్పూరు మున్సిపాలిటీలో 9వ వార్డుల్లో సర్వే చేపట్టారు. ఐదురోజుల్లో ఈ సర్వే పూర్తి చేయాల్సి ఉండగా.. అదనపు కలెక్టర్లు, ఆర్డీఓల, జెడ్పీ సీఈఓలు పర్యవేక్షించగా..మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, జెడ్పీ సీఈఓల ఆధ్వర్యంలో బృందాలుగా ఏర్పడి అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రత్యేకాధికారి రవినాయక్ అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్‌తో కలిసి ఆల్వాన్‌పల్లి, జడ్చర్ల, భూత్పూర్‌లో సర్వేను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి కుటుంబాన్ని సర్వే నిర్వహించాలని, మహిళలను హెడ్ ఆఫ్‌ది ఫ్యామిలీగా ఎంపిక చేయాలన్నారు. కుటుంబంలో ఆధార్‌కార్డు ఆధారంగా వయసు సరిచేయాలని, పెళ్లయిన ఆడపిల్లలుంటే వారి కుటుంబం నుంచి తొలగించాలని, ఇంట్లో ఎవరిపేరు లేకున్నా.. వారిని కలపాలన్నారు. సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని, ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా చూడాలన్నారు. గడువులోగా సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు. కలెక్టర్ విజయేందిర హన్వాడ మండలం మాదారంలో సర్వేను పరిశీలించారు. ప్రజలు కుటుంబ సర్వేను సహకరించి..వారి వివరాలను సర్వే బృందాలకు అందజేయాలని ఆమె సూచించారు. మహబూబ్‌నగర్ మున్సిపాలిటీలోని 37వ వార్డులోని సద్దలగుండు, రాజేంద్రనగర్‌లో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి సర్వేను ప్రారంభించగా.. సీతారాంపేట సర్వేను భూసేకరణ ప్రత్యేక ఉప కలెక్టర్ రాంరెడ్డి పరిశీలించారు. ఆయా సర్వేల్లో జెడ్పీ సీఈఓ వెంకట్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్లు మహేశ్వర్‌రెడ్డి, రాజయ్య, సరేందర్‌రెడ్డి, తహసీల్దార్లు,ఎంపీడీఓలు, అధికారులు పాల్గొన్నారు.
తొలిరోజు పరిశీలించిన ఉమ్మడి జిల్లా
ప్రత్యేకాధికారి రవినాయక్
గడువులోగా ప్రతి కుటుంబాన్ని సర్వే చేయాలని ఆదేశం
Comments
Please login to add a commentAdd a comment